గుంటూరు

నగరానికి రాజధాని శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 21: పారిశుద్ధ్య నిర్వహణలో నగరపాలక సంస్థ వినూత్నమైన కార్యక్రమాలను అమలు చేస్తుండటంతో స్వచ్ఛ సర్వేక్షణ్ సాధించే దిశగా అడుగులువేస్తోంది.. వ్యక్తిగత, పబ్లిక్, ప్రైవేటు ఈ టాయిలెట్లు, చెత్త తరలింపు, తదితర అంశాలపై నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేక దృష్టి సారించడంతో ఎప్పటికప్పుడు నగరం పరిశుభ్రంగా దర్శనమిస్తోంది.. దీనికితోడు డివైడర్లను అందంగా రంగులతో తీర్చిదిద్దడం..పూలమొక్కలు నాటటం.. కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలపై ప్రహరీ గోడలపై చారిత్రాత్మక, కళాత్మక చిత్రాలతో అందంగా అలంకరించటం..ప్రధాన కూడళ్లలో ఈ టాయిలెట్లను అందుబాటులోకి తీసుకురావటంతో నగర రూపురేఖలు మారుతున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్-2018ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాలు చేపట్టటంతో మెరుగైన ర్యాంకు సాధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా నగర వ్యాప్తంగా పూర్తిస్థాయిలో డోర్‌టు డోర్ చెత్త సేకరణ, తడి, పొడిగా వేరు చేయటంపైన ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్గిస్తున్నారు. ఇందులో భాగంగా నిత్యం 420 మెట్రిక్ టన్నుల చెత్తను డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ స్వచ్ఛ సర్వేక్షణ్-2017 కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా 434 పట్టణాలను ఎంపిక చేయగా నగరపాలక సంస్థకు 118 వ ర్యాంకు వచ్చింది. ఈ ఏడాది 4041 పట్టణాలను ఎంపిక చేసింది. గత ఏడాది కంటే మెరుగైన ర్యాంకు సాధించేందుకు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధతో పాటు పలువురు అధికారులు ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తున్నారు. డోర్‌టు డోర్ చెత్తను సేకరించేందుకు 422 మంది శాశ్వత సిబ్బందితో పాటు 1676 మంది తాత్కాలిక సిబ్బందిని నియమించారు. రాష్ట్రంలో ఏ నగరపాలక సంస్థలో లేనివిధంగా గుంటూరు నగరంలో గాంధీపార్కులో వ్యర్థపదార్థాల నుండి కంపోస్టును తయారుచేసే యంత్రాలను ఏర్పాటుచేశారు. ప్రతిరోజు ఆరు టన్నుల వ్యర్థాల నుండి కంపోస్టును తయారు చేస్తున్నారు. దీనిని డివైడర్లలోని పూలమొక్కలు, పార్కులు, ప్రధాన కూడళ్లలో ఏర్పాటుచేసిన ఐలండ్‌లలోని పూలమొక్కలకు ఎరువులుగా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ తరహా కంపోస్టు తయారీ సత్ఫలితాలను ఇస్తుండటంతో రైతుబజార్లు, 34వ వార్డులోని కెకెఆర్ గౌతం స్కూలు ప్రాంతాల్లో కంపోస్టు తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. నగరంలో 586 ప్రాంతాల్లో శాశ్వత చెత్తకుప్పల ప్రాంతాలుగా గుర్తించి 108 ప్రాంతాలను గ్రీన్ స్పాట్స్‌గా అభివృద్ధి చేశారు. గత ఏడాది కంటే జనాభా పెరగటం, పెద్దఎత్తున చెత్త కుప్పలు పేరుకుపోతుండటంతో ప్రస్తుతం ఉన్న 70 డంపర్‌బిన్‌లతో పాటు మరో 140 కాంఫార్టర్ బిన్‌లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే గుంటూరు నగరాన్ని ఓడీఎఫ్ రహిత నగరంగా ఎంపిక చేశారు. వీటికితోడు ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు పురసేవ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఏడాది 15వేల మందికి యాప్‌ను అందుబాటులో తీసుకురావాలనేది లక్ష్యంకాగా ఇప్పటికే 17వేల 600 మంది డౌన్‌లోడ్ చేసుకుని స్థానికంగా తమకు ఎదురవుతున్న సమస్యలను నగరపాలక సంస్థ అధికారుల దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకురావటంతో త్వరితగతిన పరిష్కారం అవుతున్నాయి. మొత్తంగా నగరపాలక సంస్థ తీసుకున్న సంస్కరణల కారణంగా రాజధాని శోభ సంతరించుకుంటోంది.

గుళికల మందు తిని చిన్నారి మృతి

*ప్రాణాపాయ స్థితిలో మరో ఇద్దరు పసికందులు

అమరావతి, జనవరి 21: విష గుళికలు మింగి అభంశుభం తెలియని చిన్నారి మృతి చెందటంతో పాటు మరో ఇద్దరు పసిపిల్లలు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా కొసిగి మండలం పల్లెపాడుకు చెందిన 25 కుటుంబాల వారు అమరావతి మండలం నరుకుళ్లపాడులో పత్తి తీసేందుకు కూలీలుగా వచ్చారు. యథావిధిగా ఆదివారం ఉదయం నరుకుళ్లపాడుకు చెందిన మండూరి వెంకట్రావు అనే రైతు చేలో పత్తి తీసేందుకు వెళ్లాడు. వారి వద్ద ఉన్న ముగ్గురు పిల్లలను ట్రాక్టర్‌పై ఉంచి తల్లిదండ్రులు పత్తితీసే పనిలో నిమగ్నమయ్యారు. ట్రాక్టర్‌లో ఉన్న గుళికల మందు తినేదిగా భావించి ముగ్గురు పిల్లలు తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ట్రాక్టర్‌లో పత్తివేసేందుకు వచ్చిన తల్లిదండ్రులు పిల్లలు యన్నాలతోటి సురేఖ (8 నెలలు), యన్నాలతోట లక్ష్మీ కాంతరెడ్డి (3సంవత్సరాలు) విషగుళికలు మింగి ప్రమాదకర పరిస్థితుల్లో పడి ఉండటాన్ని గమనించి 108 సహాయంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారితో పాటు గుళికలు తిన్న కమ్మలదినె్న అను (2 సంవత్సరాలు) అమరావతి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. సమాచారం తెలుసుకున్న వెంటనే అమరావతి సీఐ కట్టా శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని పరిశీలించి చిన్నారులను కాపాడే ప్రయత్నం చేశారు. సురేఖ, లక్ష్మీకాంతరెడ్డి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణమంతా విషాద ఛాయలు అలముకున్నాయి. ఈమేరకు అమరావతి ఎస్‌ఐ నరసింహారావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.