గుంటూరు

అర్హులందరికీ సొంతిళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, జనవరి 23: సొంతింటి కోసం మంగళగిరి పురపాలక సంఘం పరిధిలో దరఖాస్తు చేసుకున్న వారి ఆధార్, రేషన్ కార్డుల్లో స్వల్ప తేడాలు ఉన్నందునే అర్హుల జాబితాలో కొందరి పేర్లు చోటు చేసుకోలేదని వాటిని సరిచేసుకుంటే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సొంతింటి నిర్మాణం జరుగుతుందని ఏపీ టౌన్‌షిప్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టిడ్కో) సాంకేతిక అధికారి కె శ్రీనివాసరావు అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ప్రధానమంత్రి ఆవాజ్ యోజన - హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమంపై ఏర్పాటు చేసిన కౌన్సిల్ సభ్యుల సమావేశంలో శ్రీనివాసరావు పాల్గొని గృహనిర్మాణ పధకంపై ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. ఆధార్, రేషన్‌కార్డుల్లో తప్పులు ఉన్న వారు వెంటనే వాటిని సరిచేసుకుంటే అర్హులైన లబ్దిదారులందరికీ గృహం మంజూరవుతుందని, మంగళగిరి పురపాలక సంఘానికి తొలి విడతగా 2592 గృహాలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి, వైస్‌చైర్మన్ నందం బ్రహ్మేశ్వరరావు, కమిషనర్ ఎన్‌వి నాగేశ్వరరావు, టిడ్కో అధికారులు బి చింతయ్య, డి మాధవి, ఎస్ వెంకటాద్రి, వివిధ పార్టీల కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

వరికుప్పలను ముంచిన నీరు

చేబ్రోలు, జనవరి 23: ఇరిగేషన్ అధికారుల అవగాహన లోపం వల్ల ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంట చేతికందే సమయంలో నీటిపాలయింది. చేబ్రోలు నుంచి వడ్లమూడి వెళ్లే మార్గంలో మరుగుమ్మ వంతెన అనాది కాలంగా శిధిలావస్థకు చేరి మరమ్మతులకు నోచుకోలేదు. కాల్వనీరు వదిలినప్పుడల్లా నీరు లీకై చుట్టుపక్కల పొలాల్లోని వరికుప్పలను ముంచెత్తుతోంది. ప్రస్తుతం మూడు రోజుల క్రితం నీరు విడుదల చేయటంతో మరుగుమ్మ వంతెన వద్ద నీరు లీకై వంతెన నుంచి నల్లచెరువు వరకు ఉన్న పొలాల్లో వరికుప్పలు నీట మునిగాయి. ఈ ప్రాంతంలో సుమారు 200 ఎకరాల్లో వరికుప్పలు వేయగా, రబీలో రెండవ పంటగా వేసిన మొక్కజొన్న సైతం ముంపునకు గురైంది.