గుంటూరు

ఆంక్షలు అతిక్రమిస్తే అరెస్టులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 23: వామపక్ష, దళిత, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన ‘్ఛలో గొట్టిపాడు’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లా అంతటా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది జనవరి ఒకటవ తేదీన రెండు సామాజికవర్గాల మధ్య వివాదం, ఘర్షణల నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే కొంతమందిని అరెస్టుచేసి, శాంతి కమిటీని ఏర్పాటుచేశారు. అయితే బాధిత దళితులకు న్యాయం చేసేవరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వామపక్ష, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. బుధవారం ‘్ఛలో గొట్టిపాడు’ను అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తు అరెస్టులు ప్రారంభించారు. ఇందులో భాగంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, జిల్లా కార్యదర్శి రమాదేవి, సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. పెదగొట్టిపాడులో సెక్షన్ 30 యాక్టుతో పాటు 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఎలాంటి ప్రదర్శనలు, ఆందోళనలు నిర్వహించరాదని అర్బన్ జిల్లా ఎస్‌పీ సీహెచ్ విజయారావు స్పష్టం చేశారు. ఆంక్షలను అతిక్రమిస్తే అరెస్టులు తప్పవని హెచ్చరించారు. తమ స్వార్ధం కోసం కొందరు వివాదాలను రెచ్చకొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ముందస్తు చర్యల్లో కొందరిని అదుపులోకి తీసుకుంటున్నట్లు తెలిపారు.
అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు: సీపీఐ
పోలీసులు అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ అన్నారు. అజయ్‌కుమార్‌ను మంగళవారం తూర్పు డీఎస్‌పీ కండె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో పెనుగులాట జరిగింది. అజయ్‌కుమార్‌ను బలవంతంగా జీపులో ఎక్కించి నగరంపాలెం స్టేషన్‌కు తరలించారు.

ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు

గుంటూరు (కొత్తపేట), జనవరి 23: తెలుగుదేశం కార్యకర్తల సంక్షేమ విభాగం ఏర్పాటు చేయటమేకాక వారి సమస్యలు పరిష్కరించిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ యువతకు ఆదర్శంగా నిలిచారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు, గిరిజన, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనంద్‌బాబు అన్నారు. టీడీపీ జాతీయ కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలను రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్భ్రావృద్ధిలో లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని, యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రణాళిక రూపొందించి రాష్ట్రానికి ఐటీ కంపెనీలు సాధిస్తున్నారని వివరించారు. తొలుత లోకేష్ జన్మదినోత్సవ కేక్‌ను మంత్రులు కట్‌చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, రాష్ట్ర పార్టీ కార్యాలయ కార్యదర్శి ఎవి రమణ, టీడీపీ నాలెడ్జి సెంటర్ కోఆర్డినేటర్ గురజాల మాల్యాద్రి, ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ, పార్టీ నాయకులు రాయపాటి రంగారావు, దారపనేని నరేంద్ర, మిర్చి యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో..
టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఐటీ శాఖ మంత్రి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా సంఘం అధ్యక్షుడు సాకిరి చైతన్య ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదవుతున్న పదవతరగతి విద్యార్థులకు వెయ్యి మందికి ఎగ్జామినేషన్ ప్యాడ్‌లు అందజేశారు. రైలుపేటలో సాయిబాబా గుడి వద్ద జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు శివనాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో అన్నదానం, వృద్ధాశ్రమంలో పేదలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు.