గుంటూరు

జగద్గురు ఆదిశంకర భగవద్రామానుజులు కలియుగాన కారణజన్ములు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), మే 8: సర్వసంగ పరిత్యాగులై తమ తపో, జ్ఞాన, శక్తిని సమస్త మానవాళికే కాకుండా సర్వ ప్రాణకోటి సంక్షేమం కోసం ధారపోసిన జగద్గురువులు శ్రీ ఆదిశంకర భగవత్పాదులు శ్రీ భగవద్రామానుజాచార్య స్వామి అని శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి తమ మంగళాశాసనాల్లో వినమ్రతాపూర్వకంగా అంజలి ఘటించారు. ఆదివారం ఉదయం నగరానికి విచ్చేసిన ఆచార్య స్వామి గుజ్జనగుండ్ల పయనీర్ షాంగ్రీల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన శ్రీ భగవద్రామానుజాచార్యుల సహస్రాబ్ది మహోత్సవాల ప్రారంభ వేడుకల్లో జీయర్‌స్వామి అసంఖ్యాకంగా తరలివచ్చిన భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. ఆదిశంకరాచార్యులు 7వ శతాబ్దంలో అవతరిస్తే 300 యేళ్ల తర్వాత 11వ శతాబ్దం ప్రారంభంలో శ్రీ భగవద్రామానుజాచార్య స్వామి అవతరించారన్నారు. ఈ ఇద్దరు కూడా లోకానికి మహోపకారం చేశారని జీయర్‌స్వామి బహుదాకీర్తించారు. ఇంతటి మహిమాన్వితులైన రామానుజాచార్య స్వామి సహస్రాబ్ది మహోత్సవాలను వెయ్యి రోజుల పాటు భారతదేశమంతా నిర్వహించడానికి కృషి చేస్తున్నామన్నారు. తొలుత ప్రాంగణానికి విచ్చేసిన జీయర్‌స్వామి బృందానికి జి కూర్మనాథస్వామి, వ్యాపారవేత్త చుక్కపల్లి రమేష్ దంపతులు, ప్రసాద్, భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ వ్యవస్థాపకులు బొల్లేపల్లి సత్యనారాయణ, వెంకన్న దేవాలయ అధ్యక్షుడు సిహెచ్ మస్తానయ్య, వికాస తరంగిణి, యతిరాజ సేవామండలి సభ్యులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.