గుంటూరు

అందరూ ఇంకుడుగుంతల తవ్వకంలో భాగస్వాములు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మే 8: ప్రస్తుతం నెలకొనియున్న మంచినీరు, సాగునీటి ఎద్దడి దృష్ట్యా ప్రభుత్వ పిలుపుమేరకు ప్రతి ఒక్కరూ ఇంకుడుగుంత తవ్వే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అత్తలూరు ఆర్‌సిఎం విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ కె అరుణపాపారావు, ఫాదర్ బెల్లంకొండ చిన్నయ్య పర్యవేక్షణలో ఆర్‌సిఎం స్కూలు ప్రాంగణంలో ఆదివారం ఇంకుడుగుంత తవ్వకం ప్రారంభించారు.
అరుణ పాపారావు, చెన్నయ్యలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉపాధ్యాయ బృందం ఇంకుడుగుంతలు తీసే కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ఆర్‌సిఎం హైస్కూల్ హెచ్‌ఎం పి లూర్దుశౌరయ్య, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం బెల్లంకొండ లూర్దుమేరి, అంతయ్య, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కన్వీనర్ మొక్కపాటి రాంబాబు, ఉపాధ్యాయులు బలుసుపాటి సత్యనారాయణ, డి కోటేశ్వరరావు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు.