గుంటూరు

సబ్‌ప్లాన్ నిధుల లెక్కలు తేల్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 8: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేస్తోంది.. గ్రామాల శివార్లలో ఉంటున్న కాలనీలకు మంచినీటిని సరఫరా చేసేందుకు కూడా ఈ నిధులు మంజూరు కావటంలేదు.. సబ్‌ప్లాన్ నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపణలు చేస్తున్నాం.. మనం చేస్తున్నదేమిటి? అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది.. ఇప్పటి వరకు ఏ నియోజకవర్గానికి ఎంత కేటాయించారు..ఏ పనులు చేపట్టారనేది కూడా తెలియటంలేదు.. ముందు ఆ లెక్కలేంటో తేల్చండని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశం చైర్‌పర్సన్ జానీమూన్ అధ్యక్షతన జరిగింది. సాక్షాత్తు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎదురుగా అధికారపక్షానికి చెందిన ఎమ్మెల్యేలు సబ్‌ప్లాన్ నిధుల ఖర్చుపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే ప్రజల్లో ఏరకంగా విశ్వసనీయత ఉంటుందని ప్రశ్నించారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ గ్రామాలకు దూరంగా ఉన్న ఎస్సీ కాలనీలలో వౌలిక సదుపాయాలు కల్పించేందుకు వెచ్చించాల్సిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు ఏమయ్యాయో అర్ధం కావటంలేదన్నారు. ఓ పక్క ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు విడుదల చేస్తున్నప్పటికీ జిల్లాలో ఇప్పటికీ వౌలిక సదుపాయాలులేక కాలనీల వాసులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ప్రధానంగా ఎస్సీ నియోజకవర్గాలకు ఎంత మేరకు ఖర్చుచేశారో వివరించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ తన నియోజకవర్గంతో పాటు బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు కేటగిరీలో ఉందని అయినా సబ్‌ప్లాన్ నిధులతో ఏ ఒక్క పని చేపట్టలేదని సమావేశం దృష్టికితెచ్చారు. జిల్లాకు సబ్‌ప్లాన్ కింద వచ్చిన నిధులను సమాన ప్రాతిపదికన పంపిణీ చేయాల్సిందిపోయి కొన్ని ప్రాంతాలకే కేటాయించటం సమంజసం కాదన్నారు. ఈ ఏడాది మార్చి నెలాఖరులో సబ్‌ప్లాన్ నిధులు కేటాయిస్తూ జీవోలు విడుదలైనప్పటికీ వాటిని ఏ కారణంచేత నిలిపివేశారని ప్రశ్నించారు. అధికార పార్టీ ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ప్రభాకర్ మరో అడుగు ముందుకేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి..మనకు తేడా ఏమీలేదని వ్యాఖ్యానించారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని విమర్శిస్తున్న మనం ఆత్మ విమర్శ చేసుకోవాల్సి వస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో సబ్‌ప్లాన్ కింద వేల కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నట్లు ప్రకటనలు ఇస్తున్నప్పటికీ బాపట్ల, రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో ఒక్క పైసా కూడా ఖర్చు చేయకపోవటంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. మారుమూల కాలనీలకు కనీసం రోడ్లు కూడా వేయలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, కలెక్టర్ కాంతీలాల్ దండే మాట్లాడుతూ త్వరలో సాంఘిక సంక్షేమమంత్రి సమక్షంలో సబ్‌ప్లాన్ నిధుల కేటాయింపు.. ఖర్చు.. తదితర అంశాలపై చర్చిద్దామని ఎమ్మెల్యేలకు నచ్చచెప్పారు.