గుంటూరు

రాజాధిరాజ వాహనంపై లక్ష్మీనృసింహుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, ఫిబ్రవరి 23:బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి లక్ష్మీనరసింహ స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా రాజాధిరాజ వాహనంపై పురవీధుల్లో విహరించారు. పెదపాలెంకు చెందిన పెమ్మసాని శైలేంద్ర కైంకర్య పరులుగా వ్యవహరించారు. భక్తజన సంరక్షుడు, దీనజనబంధువు భక్తజన సంరక్షణా కంకణ బద్ధుడై రాజాధిరాజ వాహన రూఢుడై భక్తులకు దర్శన మివ్వడంతో నేత్ర పర్వంగా దర్శించుకున్నారు. ఆలయం నుంచి ప్రారంభమైన స్వామివారి గ్రామోత్సవం మెయిన్ బజార్‌లో ప్రపత్తి ఆంజనేయస్వామి ఆలయం వరకు వెళ్లి తిరిగి ఆలయానికి చేరింది.
నృసింహ భక్తబృందం మిద్దె సెంటర్లో ప్రసాదాలు పంచిపెట్టారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారి ఎగువ, దిగువ ఆలయాలను రంగు రంగుల విద్యుత్ దీపాలతో సుందర శోభాయమానంగా అలంకరింప జేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆలయం ఎదుట గల కళావేదికపై శ్రీవిష్ణు వైభవం, జానపద దేశభక్తి గీతాలు, భజన కార్యక్రమం, విజయవాడకు చెందిన తేజస్విని నృత్య ప్రదర్శన మొదలైన కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారి వాహన అలంకారాలను తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో వస్తుండటంతో రాత్రివేళ ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిట లాడుతున్నాయి. ఆలయ ఇఓ మండెపూడి పానకాలరావు పర్యవేక్షించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి యాలివాహనంపై స్వామివారి గ్రామోత్సవం జరుగుతుందని ఇఓ పానకాలరావు తెలిపారు.

డ్రైనేజీ పనులకు శంకుస్థాపన
నరసరావుపేట, ఫిబ్రవరి 23: సత్తెనపల్లి రోడ్డులోని బీసీ కాలనీ నుండి చంద్రబాబునాయుడు కాలనీ వరకు నిర్మించనున్న డ్రైనేజీ పనులకు శుక్రవారం స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు శంకుస్థాపన చేశారు. సుమారు 3.95 కోట్ల రూపాయలతో నిర్మించే ఈ స్ట్రామ్ వాటర్ డ్రైనేజి పనులను నాణ్యతతో చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తా, కమిషనర్ భానూప్రతాప్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.