గుంటూరు

ఊసరవెల్లిని మించిన సీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజారు), ఫిబ్రవరి 23: ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు చేస్తున్న ప్రకటనను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని వైసీపీ నేతలు ఆరోపించారు. నగరంలోని జిల్లా వైసీపీ కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు రావి వెంకట రమణ మాట్లాడుతూ హోదా గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. గత నాలుగేళ్ల నుండి టీడీపీ నేతలు ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు చేసి, చివరి సంవత్సరంలో హోదా గురించి మాట్లాడుతున్నారన్నారు. ఈ రాష్ట్రాన్ని అనైతికంగా విభజించడంలో బాబు పాత్ర ప్రజలందరికీ తెలుసన్నారు. 5 కాదు 10, 15 ఏళ్లపాటు ప్రత్యేక హోదా కావాలని నానా హంగామా చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్యాకేజీయే ముద్దు అని చెప్పలేదా అని వారు ప్రశ్నించారు. హోదా విషయంలో తమ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి రాజీలేని పోరాటాలు చేస్తున్నారన్నారు. రాష్టవ్య్రాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టారన్నారు. ప్రత్యేక హోదా అసెంబ్లీ సైతం రెండు పర్యాయాలు తీర్మానాలు చేశామని వారు చెప్పారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, ప్రత్యేక హోదా కాదని ప్యాకేజీ కేంద్రం ఇచ్చిందని, టీడీపీ నేతలు టపాసులు పేల్చి, స్వీట్లు పంచుకోలేదా అని వారు ప్రశ్నించారు.
ముమ్మాటికీ నిజం...
టీడీపీ ప్రభుత్వానికి ఐపీఎస్, ఐఏస్ అధికారులు కొమ్ముకాస్తున్నారన్న మాట వాస్తవమని ఎమ్మెల్యే ఆర్‌కె స్పష్టంచేశారు. వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణల్లో పక్కా ఆధారాలున్నాయని, అవసరమైతే నిరూపిస్తామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో దోచుకున్న సొమ్ముతో వైసీపీ ఎమ్మెల్యేలను పశువులు కొన్నట్లు కొనలేదా అని ప్రశ్నించారు. ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఫిర్యాదుపై టీడీపీ నేతలు మసిపూసి మారేడుకాయ చేసేందుకు ప్రయత్నించారని విమర్శించారు. ఇప్పుడు మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఏమి సమాధానం చెప్పారని డిమాండ్ చేశారు. ఇద్దరు ఐఏఎస్ అధికారుల సమక్షంలోనే మంత్రులు వాటాలు పంచుకోలేదా అన్నారు. వీరా అధికారులపై కపట ప్రేమను చూపించేది అని నిలదీశారు. తహశీల్దార్ వనజాక్షి, సీనియర్ ఐఏఎస్ బాల సుబ్రహ్మణ్యం విషయాల్లో ఏ విధంగా వ్యవహరించారో ప్రజలు మర్చిపోలేదన్నారు. ఈ సమావేశంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారి రోశయ్య, నేతలు మందపాటి శేషగిరిరావు, షేక్ జిలాని, బండారు సియిబాబా తదితరులు పాల్గొన్నారు.