గుంటూరు

మంచినీటి సరఫరాలో నిర్లక్ష్యాన్ని సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, మే 10: పట్టణంలో మంచినీటి సమస్య నెలకొందని ప్రజాప్రతినిధులు పేర్కొనడంతో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం అధికారులు, ప్రజాప్రతినిధులతో కరవు, ఎండల తీవ్రత, మంచినీటి సమస్యపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, హోం శాఖామంత్రి నిమ్మకాయల చినరాజప్ప అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు పట్టణంలో మంచినీటి సరఫరా సక్రమంగా చేస్తున్నామని పేర్కొనడంతో అక్కడే ఉన్న మున్సిపల్ కౌన్సిలర్లు పలువురు అన్నివార్డుల్లో మంచినీటి సమస్య ఉందని పేర్కొనడంతో చినరాజప్ప కమిషనర్‌పై ఆగ్రహించారు. వేసవికాలం రాకముందే మంచినీటిపై దృష్టి సారించాలని చెప్పినా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. యుద్ధ ప్రాతిపదికన బోర్లు తవ్వించి మంచినీటి సమస్య లేకుండా చేయాలని, బావులు ఉంటే మరమ్మతులు చేయించాలని, తాను 10 రోజుల్లో మళ్లీ వస్తానని చినరాజప్ప అన్నారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంకుకు పట్టణ శివారు 142 ఎకరాలు గుర్తించి ప్రతిపాదనలు పంపామని కమిషనర్ పేర్కొనగా జిల్లా కలెక్టర్‌తో తాను మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని అన్నారు. పట్టణంలో సబ్‌స్టేషన్ నిర్మాణానికి 12 కోట్ల రూపాయలు మంజూరైనా వాటి ఏర్పాటుకు స్థలం లేదని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొనగా మున్సిపల్, రెవిన్యూ అధికారులను సమన్వయంతో సబ్‌స్టేషన్లకు స్థలం చూపాలని చినరాజప్ప ఆదేశించారు. నియోజకవర్గంలో మద్యం బెల్టు షాపులు ఉన్నట్లు తెలిసిందని, వాటిని అరికట్టకుంటే చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులను ఆయన హెచ్చరించారు. 18, 20 వార్డుల్లో నివాసాల మధ్య మద్యం విక్రయాలకు అనుమతించారని, సాయంత్రం వేళ మహిళలు తిరగలేని పరిస్థితి ఉందని కౌన్సిలర్లు చిదానంద శాస్ర్తీ, ఉడతా శ్రీను, పద్మజ తదితరులు హోంమంత్రి దృష్టికి తీసుకు రాగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో 13,14 ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయితీ నిధులు మ్యాచింగ్ గ్రాంటుగా వినియోగించి 3 కోట్ల రూపాయలతో రహదారులు నిర్మిస్తున్నామని మండల ఏఈ వివరించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద అప్రోచ్‌రోడ్లు ఏర్పాటుకు అంచనాలు తయారు చేసి పంపాలని సాంఘిక సంక్షేమ శాఖామంత్రి రావెల కిషోర్‌బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లోని వౌలిక వసతులకు 600 కోట్ల రూపాయల ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు కేటాయించామని వార్డుల్లో ఎస్సీ, ఎస్టీ జనాభా 40 శాతం ఎక్కడ ఉంటే అక్కడ నిధులు వెచ్చించ వచ్చని కిషోర్‌బాబు పేర్కొన్నారు. ఇంకుడుగుంటలు, మరుగుదొడ్లు, వ్యవసాయ శాఖ, ఉద్యానశాఖ మొదలైన ప్రభుత్వ శాఖలో ప్రగతిపై చినరాజప్ప సమీక్షించారు. మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి, ఎస్‌ఈ ప్రసాద్, వైస్‌చైర్మన్ సంకా బాలాజీగుప్తా తదితరులు పాల్గొన్నారు. అనంతరం హోంమంత్రి చినరాజప్పను ఘనంగా సత్కరించారు.