గుంటూరు

విద్యతోనే అభివృద్ధి సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడికొండ, ఏప్రిల్ 22: సమాజంలో వ్యక్తి అభివృద్ధి చెందాలంటే విద్యతోనే సాధ్యం అవుతుందని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్ విద్యార్థులకు చూచించారు. పొనె్నకల్లు గ్రామంలో డివికె రామిరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సహకారంతో 20 లక్షల రూపాయులతోనిర్మించిన పాఠశాల ఆడిటోరియంను జిల్లా చైర్‌పర్సన్ షేక్ జానీమూన్, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఉపాధ్యా ఎంఎల్‌సి ఎఎస్ రామకృష్ణ ఆదివారం ప్రారంభించారు. సభకు పాఠశాల ప్రాధానోపాధ్యాయులు అబ్దుల్ అలీమ్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా జానీమూన్ మాట్లాడుతూ జిల్లాలో దాతల సహకారంతో పెద్ద మొత్తంలో నిర్మించిన ఆడిటోరియంలు కేవలం మూడు లేక నాలుగు మాత్ర మే ఉన్నాయన్నారు. డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు ఒక్కరే 10 లక్షల రూపా యల సహయం చేయడం ఈస్కూల్ విద్యార్థుల అదృష్టవంతులని అన్నారు. గ్రామంలోని దాతలందరూ ముందుకు వచ్చి సహయ సహకరా లు అందిస్తున్నారని, అదే సమయంలో విద్యార్థులు చక్కగా చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆమె చూచించారు. ఎంఎల్‌సి రామకృష్ణ మాట్లాడుతూ గ్రామంలో దాతల సహకారంతో పెద్ద ఆడిటోరియం నిర్మాణం జరుపుకోవడం అభినందచ వలసిన విషయం అన్నారు. గ్రామీణా ప్రాంతాలలోని పాఠశాలలకు ప్రభుత్వం అన్ని విధాల సహకరి స్తుందని తెలిపారు. డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యతోనే సమాజ పరంగా అభివృద్ధి చెందుతుందని, ఆడిటోరియం కొరకు తనవంతు సహకారం అందించానని అన్నారు. ఈ స్కూల్ పూర్వ విద్యార్థిగా స్కూల్‌కి ఎంతోకొంత సహయం అందించాలని ముందుకు రావడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ స్కూల్ ప్రహరి నిర్మాణం, వివిధ వసతుల కల్పన కోసం ప్రభుత్వనికి ప్రతిపాదనలను పంపించామని తెలిపారు. గుంటూరు అర్బన్ ఎస్‌పి విజయరావు మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు లోను కాకుండగా క్రమ శిక్షణ కలిగి ఉండాలని చూచించారు. విద్యార్థులు మంచి మార్కులు సంపాదించి తల్లి దండ్రులకు, ఉపాద్యాయులకు, పాఠశాలకు పేరు ప్రతిష్ఠలు తీసుకురా వాలని కొరారు. అతిథులను పూర్వవిద్యార్థు లు, ఉపాధ్యాయులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ వ్యవ సాయ మార్కెట్ అధ్యక్షులు గుంటుపల్లి మధుసూదనరావు, గ్రామసర్పంచ్ గణపవరపు శివలీల, ఎంపిటిసీలు షేక్ ముంతాజ్ బేగం, కనె్నబోయిన విజయ లక్ష్మి, సుబ్బారావు, రైతాంగ సంఘటన కన్వినర్ యడ్లపల్లి గాంధీ రామ్మోహన్, విశ్రాంత ప్రాధానోపాధ్యాయుడు పుట్టి శంకరరావు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు, విద్యార్థులు పాల్గొన్నారు.