గుంటూరు

అడ్వాన్స్ ట్యాక్స్ కింద రూ.10.62 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 24: నగరపాలక సంస్థ ముందస్తు పన్ను చెల్లింపులపై ఇచ్చిన పిలుపుమేరకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీకేష్ బి లత్కర్ పేర్కొన్నారు. మంగళవారం నగరపాలక సంస్థలోని తన ఛాంబర్‌లో కమిషనర్ విలేఖర్లతో మాట్లాడుతూ 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను అడ్వాన్స్ ట్యాక్స్ కింద మంగళవారం నాటికి 10.62 కోట్ల రూపాయలు నగరవాసులు చెల్లించారన్నారు. 23,899 మంది యజమానులు ఇప్పటివరకు ఆస్థి పన్ను చెల్లించి 49.76 లక్షల రూపాయల మేర రిబేటు పొందారని తెలిపారు. ఇదే తరహాలో నగరవాసులు ఈనెల 30వ తేదీ వరకు ముందస్తు ఆస్థిపన్నును చెల్లించవచ్చని సూచించారు. మంగళవారం ఒక్కరోజే జెకెసి కళాశాల విద్యాసంస్థల చైర్మన్ జాగర్లమూడి మురళీమోహన్ 10,64,114 రూపాయలను, బాలకుటీర్ విద్యాసంస్థల యాజమాన్యం 3,30,313 రూపాయలను చెల్లించి 5 శాతం రాయితీని సద్వినియోగం చేసుకున్నారన్నారు. 2018, 2019 సంవత్సరాల పన్నును ఏకమొత్తంలో చెల్లించినట్లయితే 5 శాతం రాయితీ పొందవచ్చన్నారు. పన్ను చెల్లించేందుకు నగరపాలకసంస్థ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయంతో పాటు మీసేవ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే ఇంటి నుంచి నేరుగా ఆన్‌లైన్(డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.సిడిఎంఎ.ఎపి.జిఒవి.ఇన్)లో పన్ను చెల్లించవచ్చని తెలిపారు.

రాకాసి అలలతో సముద్రతీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
*రేపల్లె తహశీల్దార్ రమణకుమారి హెచ్చరిక
రేపల్లె, ఏప్రిల్ 24: బంగాళాఖతంలో రాకాసి అలలు ఎగసిపడే అవకాశాలు ఉన్నందున రేపల్లె సముద్ర తీర ప్రజలు అప్రమత్తంగా వుండాలని రేపల్లె తహశీల్దార్ ఎస్‌వి రమణకుమారి హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం రాత్రి స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ అండమాన్ నికోబార్ దీవుల నుండి రాకాసి అలలు ఉవ్వెత్తున ఏగసిపడే అవాకాశాలు వున్నందున విఆరోవో, విఆర్‌ఎ, పంచాయతీ కార్యదర్శులను లోతట్టు ప్రాంతాలకు వెళ్లి ఇక్కడి ప్రజలను అప్రమత్తం చెయ్యాలని కలెక్టర్ కార్యాలయం నుండి హెచ్చరికలు జారీ అయ్యాయని తెలిపారు. రేపల్లె మండలంలోని లంకేవాని దిబ్బ, అడవిపాలెం, దిండి, కొత్తపాలెం, మోళ్ళగుంట, నాసుగుంట, తాళ్ళతిప్ప, గుణం తిప్పా, గంగడిపాలెం, పల్లిపాలెం, పెనుమూడి వాసులను సురక్షిత ప్రాంతాలకు తరళి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మంగళవారం సాయంత్రం 6గంటల సమయంలో వాతాతావరణంలో ఒక్కసారిగా పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. చీకటి కమ్ముకుని పెనుగాలులు, ఈదుర గాలులు రావటంతో లోతట్టు ప్రాంత ప్రజలు ఉలిక్కి పడ్డారు. ఎది ఏమైనా ప్రజలు అప్రమత్తంగా వుండాలని మరోసారి తాహశీల్దార్ హెచ్చరించారు.