గుంటూరు

ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 25: అమరావతిలో ఉన్న ఆటోడ్రైవర్లు, టాటా మ్యాజిక్ డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అమరావతి సీఐ కట్టా శ్రీనివాసరావు హెచ్చరించారు. బుధవారం ఆటో, టాటా మ్యాజిక్ డ్రైవర్లకు పోలీసుస్టేషన్ ప్రాంగణంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. బండికి సంబంధించిన అన్ని కాగితాలు వెంట పెట్టుకోవాలన్నారు. మైనర్లకు వాహనాలు అప్పగిస్తే తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు నరసింహారావు, రహంతుల్లా తదితరులు పాల్గొన్నారు.

సందెపోగుకు జాతీయ పురస్కారం
* జిల్లా నుంచి అచ్చంపేట ఒక్కటే ఎంపిక
అచ్చంపేట, ఏప్రిల్ 25: జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని అందజేసే దీనదయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ స్వశక్తి కరన్ పురస్కార్ 2018కి గాను జిల్లా స్థాయిలో అచ్చంపేట గ్రామ పంచాయతీ ఎంపికైంది. ఈ మేరకు మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ వేదికగా జాతీయ గ్రామీణ స్వస్థీకరణ్ పురస్కార్ అవార్డును అచ్చంపేట గ్రామ సర్పంచ్ సందెపోగు వెంకయ్య పంచాయతీరాజ్ కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమార్ చేతుల మీదుగా అందుకున్నరు. స్థానికంగా లభించే వనరుల ద్వారా సంపదను అభివృద్ధి చేసి గ్రామ పంచాయతీ ఆదాయ వనరులను సమకూర్చుకోవడంతో పాటు గ్రామంలో వసతుల కల్పనకు కృషి చేసినందుకు గాను కేంద్రప్రభుత్వం అచ్చంపేట గ్రామ సర్పంచ్ సందెపోగు వెంకయ్యను ఎంపిక చేసింది. మొదటగా అవార్డు గ్రహీతలతో ప్రధాని మోదీ ఫొటో కార్యక్రమం నిర్వహించారని సర్పంచ్ వెంకయ్య తెలిపారు. పురస్కారం అందుకున్న ఆయన్ను ఎంపీపీ గుడేటి మార్తమ్మ, ప్రముఖ వైద్యులు ఎం మధుసూదనరావు, ఎండీవో డీజీ నాయక్, తహశీల్దార్ కరుణకుమార్, రాయిడి విశే్వశ్వరరావు, ఆశీర్వాదం, పివి రామారావు తదితరులు అభినందించారు.
నిమ్మకు నీరేత్తినట్టుగా వ్యవహరిస్తోన్న ప్రభుత్వం
* ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి
గుంటూరు, ఏప్రిల్ 25: రాష్ట్రంలో మహిళలపై ఇటీవల విపరీతంగా అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరేత్తినట్టుగా వ్యవహరిస్తోందని అఖిలభారత ప్రజాతంత్ర మహిళాసంఘం (ఐద్వా) రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి విమర్శించారు. బుధవారం జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఒప్పిచర్ల బాధితురాలిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఇటీవలికాలంలో 10 మంది మహిళలపై అత్యాచారాలు జరిగిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయని, వెలుగులోకి రాకుండా మరెన్నో సంఘటనలు జరిగినా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకున్న దాఖలాలు లేవని మండిపడ్డారు. ఇంతటి దుర్మార్గపు చర్యలు జరుగుతుంటే ముఖ్యమంత్రి గానీ, ప్రజాప్రతినిధులు గానీ స్పందించిన సందర్భాలు లేవన్నారు. బాధితులకు తక్షణం న్యాయం జరగాలంటే ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు లైంగికవిద్యను ప్రవేశపెట్టాలని, సంఘటనలకు పాల్పడితే కలిగే దుష్పరిణామాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి రమాదేవి, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గంగాభవాని, ఎల్ రమణ, పద్మ, షేక్ షకీలా తదితరులు పాల్గొన్నారు.