గుంటూరు

మోదీ నిజస్వరూపాన్ని ప్రజలకు తెలియజెప్పేందుకే సైకిల్ యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేబ్రోలు, ఏప్రిల్ 25: తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాన మంత్రి మోదీ ఆంధ్రులకు ఇచ్చిన హోదా హామీని నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని, ఆయన నిజస్వరూపాన్ని ప్రజల్లో ఎండగట్టేందుకే సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నామని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు డిమాండ్ చేస్తూ చేబ్రోలు మండలంలో బుధవారం స్థానిక నేతలతో కలిసి సైకిల్ యాత్ర నిర్వహించారు. చేబ్రోలు నుంచి ప్రారంభమైన ఈ యాత్ర మండల పరిధిలోని గుండవరం, గొడవర్రు గ్రామాల్లో సాగింది. మండల పరిధిలోని అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ యాత్రలో పాల్గొన్నారు. ఈ సైకిల్ యాత్రలో ఎంపీపీ షేక్ ఖాదర్‌బాషా, టీడీపీ నాయకులు సునీల్ తదితరులు పాల్గొన్నారు.

మే 4,5,6 తేదీల్లో రాజకీయ శిక్షణా తరగతులు
వినుకొండ, ఏప్రిల్ 25: స్థానిక బొల్లా బ్రహ్మనాయుడు కల్యాణ మండపంలో మే నెల 4,5,6 తేదీల్లో నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు నరసరావుపేట పార్లమెంటు ఇన్‌చార్జి అంబటి రాంబాబు తెలిపారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ కన్వీనర్ బొల్లా బ్రహ్మనాయుడుతో కలిసి అంబటి మాట్లాడారు. వెనుకబడిన ప్రాంతమైన వినుకొండలో అన్ని వసతులు ఉన్నందున ఇక్కడ శిక్షణా తరగతులు నిర్వహించేందుకు నిర్ణయించామన్నారు. ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని గత్యంతరం లేక పిల్లిమొగ్గలు వేస్తూ యూటర్న్ తీసుకుని హోదా అంటూ కపట పోరాటం చేస్తున్నారని ఎద్దేవాచేశారు. సమావేశంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.