గుంటూరు

ఆదరణ పునరుద్ధరణతో బీసీలకు ఆర్థిక చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 25: రాష్ట్రంలో బలహీనవర్గాల అభ్యున్నతికి గత నాలుగేళ్లలో 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత ప్రభుత్వానికి దక్కుతుందని సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. బుధవారం గుంటూరు నగరంలోని ఎన్‌టిఆర్ స్టేడియంలో జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో ఆదరణ పథకం-2 కింద ఏర్పాటుచేసిన ఆధునిక పరికరాల ప్రదర్శన, అవగాహన సదస్సు జరిగింది. సదస్సును మంత్రి ఆనందబాబు, కలెక్టర్ కోన శశిధర్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డిలతో కలిసి ప్రారంభించి వివిధ చేతి వృత్తులకు సంబంధించిన ఆధునిక పరికరాలతో స్టాల్స్ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 50 శాతం పైబడి ఉన్న వెనుకబడిన తరగతుల అభివృద్ధికి దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఈ ఏడాది 10 వేల కోట్లతో బిసి సబ్‌ప్లాన్ ఏర్పాటుచేశామన్నారు. వెనుకబడిన కులాలకు చెందిన చేతివృత్తుల వారి ఆర్థికాభివృద్ధి కోసం ఆదరణ పథకాన్ని పునరుద్ధరించిందని జిల్లాలో ఉన్న బీసీ కులాలకు చెందిన చేతివృత్తులు, కులవృత్తుల వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతో సామాజిక వికాసం, కుటుంబ వికాస కార్యక్రమాలను అమలు చేస్తోందని, ఇందులో భాగంగా ప్రతి కుటుంబం కనీసం 10 వేల రూపాయలకు తక్కువ కాకుండా ఆదాయం సంపాదించేలా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఆదరణ పథకం కింద 70 నుండి 90 శాతం సబ్సిడీతో ఆధునిక పరికరాలు అందజేయడం జరుగుతుందని వివరించారు. జిల్లాలో గత ఏడాది వెనుకబడిన సేవా సహకార సంఘం ద్వారా 4,019 యూనిట్లు లక్ష్యాన్ని నిర్దేశించగా 4,300 యూనిట్లు గ్రౌండింగ్ చేసి నూరుశాతానికి పైగా లక్ష్యాలను అధిగమించామన్నారు. తరచూ బ్యాంకర్లతో సమావేశమై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో గుంటూరు జిల్లా రాష్ట్రం మొత్తంగా ప్రథమస్థానంలో నిలిచిందని కలెక్టర్ వివరించారు. నగరంలో బీసీ భవన్ నిర్మాణానికి 5 కోట్ల నిధులు మంజూరు చేశారని, వచ్చే ఏడాది మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి నాటికి భవన నిర్మాణం పూర్తి చేయడానికి తనవంతు కృషిచేస్తానన్నారు. ఎమ్మెల్యే వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన తరగతులకు చెందిన అనేక కులవృత్తుల వారి కలలు సాకారం చేసేందుకు ఆదరణ ఉపకరిస్తుందన్నారు. తొలుత మంత్రి, కలెక్టర్, ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, రాష్ట్ర కల్లుగీత కార్మిక ఫెడరేషన్ అధ్యక్షుడు తాతా జయప్రకాష్, విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ కనకాచారి, కృష్ణబలిజ ఫెడరేషన్ చైర్మన్ కావటి సాంబ్రాజ్యం, వడ్డెర ఫెడరేషన్ చైర్మన్ దేవళ్ల మురళి, రజక ఫెడరేషన్ చైర్మన్ ఆర్ నారాయణ, నాయిబ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ జి నాగేశ్వరరావు, మేదర ఫెడరేషన్ చైర్మన్ సుందరయ్య, మంగళగిరి మున్సిపల్ చైర్మన్ జి చిరంజీవి, బీసీ కార్పొరేషన్ ఇడి, డిడి ఇతర అధికారులు పాల్గొన్నారు.