గుంటూరు

ప్రభుత్వాసుపత్రిలో వైద్యసేవలు పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, ఏప్రిల్ 26: పట్టణ శివారులో ఎయిమ్స్ నిర్మాణంలో ఉన్నప్పటికీ మంగళగిరి ప్రభుత్వాసుపత్రిని నిర్లక్ష్యం చేయరాదని, వైద్యసేవలు మెరుగుపరిచి పేదలకు అందుబాటులో ఉంచాలని శాసనమండలి సభ్యుడు బొడ్డు నాగేశ్వరరావు అన్నారు. ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యాన స్థానిక ప్రభుత్వాసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన తాగునీటి ఆర్‌ఓ ప్లాంటును గురువారం ఎమ్మెల్సీ నాగేశ్వరరావు ప్రారంభించారు. ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సాయిప్రసాద్‌తో కలిసి ఆస్పత్రిలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. శిధిల స్థితికి చేరిన ఎక్స్‌రే విభాగాన్ని ఆయన పరిశీలించారు. ఎమ్మెల్సీ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎయిమ్స్‌లో వైద్యసేవలు అందుబాటులోకి రావటానికి పదేళ్లు పడుతుందని, కనుక పట్టణ పరిసర గ్రామాల ప్రజలకు వైద్య సేవలందించే విధంగా ప్రభుత్వాసుపత్రిని తీర్చిదిద్దాలని, నిర్లక్ష్యం చేయరాదన్నారు. డాక్టర్ సాయిప్రసాద్ మాట్లాడుతూ వైద్యఖర్చులు పేదలు భరించలేని విధంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో వసూలు చేస్తున్నారని, తల్లీ పిల్లల సేవలందించే విధంగా ఆస్పత్రిలో సౌకర్యం ఉండాలని, గర్భిణీలు సాధారణ ప్రసవానికి 25 వేలు, సిజేరియన్ ద్వారా అయితే 35 వేల వరకు ప్రైవేట్ ఆస్పత్రులు వసూలు చేస్తున్నారని, ఇవికాక మందులు, రూముల అద్దెలు, చెల్లించలేని పరిస్థితి నెలకొందని డాక్టర్ సాయిప్రసాద్ అన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు వైద్య సేవలందించేందుకు ట్రామా కేర్‌సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. రాజధాని ప్రాంతమైనందున ఈ ప్రాంతంలో ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాల నుంచి కార్మికులు వస్తున్నారని, వారికి ఇక్కడ గుర్తింపు కార్డులేవీ ఉండవని, ఫలితంగా ప్రమాదాలు జరిగినప్పుడు వైద్యంపొందలేని పరిస్థితి నెలకొందని, అటువంటి వారికి ప్రభుత్వాసుపత్రిలో సేవలందించాల్సిన అవసరం ఉందని సాయిప్రసాద్ అన్నారు. వందపడకల ఆస్పత్రిగా దీన్ని అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి, ప్రజారోగ్య వేదిక ప్రతినిధులు నన్నపనేని నాగేశ్వరరావు, జెవీ రాఘవులు, ఎస్‌ఎస్ చెంగయ్య, ఆళ్ల సాంబిరెడ్డి, వంశీకృష్ణ, భాగ్యరాజు తదితరులు పాల్గొన్నారు.