గుంటూరు

రోడ్లు విస్తరించాలని కాంగ్రెస్ ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, మే 24: పట్టణంలో వాహనాల సంఖ్య భారీగా పెరగడంతో ప్రజలు ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ప్రధాన రహదారులను విస్తరించి అభివృద్ధి పరచాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యాన గురువారం తహశీల్దార్, మున్సిపల్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు. రాజధాని ప్రాంతమైనందున పట్టణం నుంచి రాకపోకలు సాగించే వాహనాల సంఖ్య భారీగా పెరిగిందని, తెనాలిరోడ్డు, గౌతమబుద్ధ రోడ్డు అత్యవసరంగా విస్తరించి, అభివృద్ధి పరచాలని, పార్కురోడ్డు వద్ద అండర్‌బ్రిడ్జి నిర్మించాలని నినాదాలు చేశారు. నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తాయి సుధీర్‌కుమార్, కాంగ్రెస్ ఇన్‌చార్జ్ తోట సాంబశివరావు, పార్టీ బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈఎస్ నాగేశ్వరరావు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె అమర్నాధ్, కాంగ్రెస్ నేతలు ఏలే హేమసుందరరావు, రంగిశెట్టి పెద్దబ్బాయి, ఎస్‌సీ సెల్ కోఆర్డినేటర్ సువర్ణరాజు, సంపత్, స్టీఫెన్, త్రినాధ్, ఈశ్వర్, గోపి తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం తహశీల్దార్ వసంతబాబుకు, మున్సిపల్ డీఈఈ పి ఏడుకొండలకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

హోదా సాధనకు సీపీఐ రిలే దీక్షలు
పొన్నూరు, మే 24: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విభజన చట్టంలోని అంశాలను అమలు చేస్తానని హామీ ఇచ్చి, కేంద్రంలో అధికారపీఠమెక్కిన నరేంద్రమోదీ చేసిన వాగ్దానాలను మరచి వ్యవహరించడం అన్యాయమని పొన్నూరు నియోజకవర్గ సీపీఐ కార్యదర్శి కేసాని కోటేశ్వరరావు దుయ్యబట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు డిమాండ్‌తో రాష్టవ్య్రాప్తంగా జరుగుతున్న దీక్షల్లో భాగంగా పొన్నూరు మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యాన గురువారం ఆరంభమైన జాగరణ దీక్షా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ నేత జి పరశురామయ్య, వైసీపీ నేతలు బొద్దులూరి రంగారావు, నాగరాజు, షఫైతుల్లా తదితరులు పాల్గొన్నారు. శిబిరంలో ప్రజానాట్య మండలి మండల శాఖ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, ఎన్ వెంకటేశ్వర్లు, ఆరేటి రామారావు, ఎఐవైఎఫ్ రమేష్‌బాబు, కరిముల్లా, ఆర్ సుగుణ, తిరుపతమ్మ, సుశీల, కె శ్రీనివాసరావు దీక్ష కొనసాగించారు. కాగా సీపీఐ కార్యకర్తల దీక్షా శిబిరాన్ని కసుకర్రు సర్పంచ్, కాంగ్రెస్ నేత జక్కా శ్రీనివాస్, తూమాటి రమేష్, యరసాని ముసలయ్య, కాలేషా, బాషా, గోపీ తదితరులు సందర్శించి తమ మద్దతు తెలియజేశారు.