గుంటూరు

విద్యా, వైద్యరంగాల అభివృద్ధి అవశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, మే 27: పాలకులు ఎవరైనా విద్యా, వైద్యరంగాలు అభివృద్ధి చెందితేనే ప్రజలు అభివృద్ధి చెందినట్లవుతుందని ప్రజారోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె సురేష్ అన్నారు. ప్రజారోగ్య వేదిక, మంగళగిరిలో వంద పడకల ప్రభుత్వాసుపత్రి సమగ్ర సాధన కమిటీ ఆధ్వర్యాన ఆదివారం స్థానిక ఎంఎంకె స్టేడియంలో నిర్వహించిన చర్చా వేదికలో ఆయన మాట్లాడారు. ప్రజారోగ్య వేదిక జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కేవీఎస్ సాయిప్రసాద్ అధ్యక్షత వహించారు. డాక్టర్ సురేష్ మాట్లాడుతూ రాజధానికి దగ్గర్లో ఉన్న మంగళగిరి ప్రాంతానికి ఇతర ప్రాంతాల నుంచి ఎంతో మంది కార్మికులు వలస వచ్చారని, మంగళగిరి ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయనన్నారు. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేసిన ఫలితంగా ప్రభుత్వాసుపత్రిలో కొంతమేర మెరుగైన వైద్య సేవలందుతున్నాయని, జీఓ నెంబర్ 33 తీసుకొచ్చి ఈ ఆస్పత్రికి నిధులు కేటాయించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. పేదప్రజలు ఉద్యమంలోకి వస్తే ప్రభుత్వం తప్పనిసరిగా మంగళగిరి ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న ఐదు డాక్టర్ పోస్టులు భర్తీ చేస్తుందని ఆయనన్నారు. డీఎంఈ, డీఎంహెచ్‌ఓ పరిధిలోకి ఆస్పత్రిని తీసుకు రావాలని అన్నారు. డాక్టర్ వంశీకృష్ణ, ఎ శ్రీనివాసరావు, శ్రీహరినాయుడు తదితరులు ప్రసంగించారు.

పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకు నివాళి
పొన్నూరు, మే 27: భారత తొలిప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 54వ వర్ధంతి సందర్భంగా పొన్నూరు మండలం కసుకర్రు గ్రామంలో గ్రామ సర్పంచ్ జక్కా శ్రీనివాస్ బృందం నెహ్రూ చిత్రపటానికి పూలమాలలువేసి ఘనంగా నివాళు లర్పించారు. భారతదేశ తొలి ప్రధానిగా దేశ అభివృద్ధికి జవహర్ నెహ్రూ చేసిన కృషిని కొనియాడారు. కార్యక్రమంలో కాం గ్రెస్ నేతలు తూమాటి రమేష్, బాపనపల్లి ప్రభాకరరావు, సి సుబ్బారావు, సరికొండ లవబాబు, సురేష్, కాలేషా, బాషా తదితరులు పాల్గొన్నారు.