గుంటూరు

తోటమ్మ తల్లికి రూ లక్ష రాబడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొన్నూరు, జూన్ 18: పట్టణంలో కొలువైయున్న తోటమ్మ తల్లి ఆలయంలోని హుండీలలో భక్తులు సమర్పించిన కానుకల లెక్కిపు సోమవారం సాయంత్రం జరిగింది. మూడు నెలల కాలంలో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా లక్షా వెయ్యి రూపాయల రాబడి ఆలయానికి లభించింది. దేవాదాయ శాఖ ఇనిస్పెక్టర్ ఎస్ కుమారబాబు పర్యవేక్షణలో ఇఒ ఎం శ్రీనివాసరావు, ఆలయ మాజీ చైర్మన్ బాలసుందరరావు, పూజారి వడ్లమూడి అమరనాథ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

ఎరువుల ధర పెంపుదలపై రైతుల ధర్నా
పొన్నూరు, జూన్ 18: కేంద్రప్రభుత్వం ఎరువుల ధర పెంచడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ రైతులు, తెలుగుదేశం పార్టీ నాయకులు నిడుబ్రోలులోని కల్పన బిల్డింగ్ వద్ద సోమవారం ధర్నా జరిపారు. 50 కేజీల యూరియా బస్తాను 45 కేజీలకు తగ్గించి రేటు మాత్రం 50 కేజీలకు వసూలు చేస్తుండటం పట్ల టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. డిఎపిపై 150 రూపాయల ధర పెంచి వ్యవసాయాన్ని భారంగా మార్చి, రైతులపై పెనుభారం మోపి మోదీ మొండి వైఖరి అవలంబిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రప్రభుత్వ వైఖరి వలన వ్యవసాయం భారంగా మారి రైతులు అల్లాడుతున్నారని, పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని తెలుగుదేశం నేతలు డిమాండ్ చేశారు. ధర్నాలో పొన్నూరు వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ నన్నపనేని ప్రభాకరరావు, వైస్ చైర్మన్ బండ్లమూడి బాబురావు, మాజీ చైర్మన్ మాదల వెంకటేశ్వర్లు, పట్టణ, మండల తెలుగుదేశం అధ్యక్షులు అహ్మద్ ఖాన్, బొర్రు రామారావు, సర్పంచ్ గరిగంటి సాయిబాబు, మున్సిపల్ చైర్‌పర్సన్ హేమలత, వైస్ చైర్మన్ ఆకుల సాంబశివరావు, పిన్నమనేని కోటేశ్వరరావు, ఆరే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.