గుంటూరు

కనువిందుగా ప్రారంభమైన భారతీయ నృత్యసంగమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), జూన్ 18: రాష్ట్రప్రభుత్వ, భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో యనశ్రీ ధ్యాన్‌తేజ్ కళాస్రవంతి అమరావతి నిర్వహణలో మూడు రోజుల పాటు జరిగే భారతీయ నృత్యసంగమం సోమవారం సాయంత్రం నగరంలోని బృందావన గార్డెన్స్ పద్మావతీ కళ్యాణ వేదికపై ప్రారంభమైంది. తొలుత పలువురు యువ నర్తకీమణులు అభినయించిన కూచిపూడి భరతనాట్య, ఆంధ్రనాట విన్యాసాలు ప్రేక్షకులను అబ్బురపర్చాయి. అనంతరం కేరళ నుండి విచ్చేసిన ప్రసిద్ధ నర్తకీమణి బిజిన బాలకృష్ణన్ అభినయించిన మోహినీ అట్టం కేరళ సంప్రదాయ నృత్యకళారీతుల వైభవాన్ని ఆవిష్కరించింది. ఈ మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నుండి పలువురు నాట్యకళాకారులు విభిన్న నృత్యాంశాలను ప్రదర్శించనున్నారు. బి చంద్రశేఖర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
* ఎమ్మెల్సీ వివివి చౌదరి
గుంటూరు (కొత్తపేట), జూన్ 18: తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత సేవమిత్రలదేనని ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యక్రమాల కమిటీ కన్వీనర్ వివివి చౌదరి పేర్కొన్నారు. సోమవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గుంటూరు జిల్లా బూత్ కన్వీనర్‌ల శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చౌదరి మాట్లాడుతూ జిల్లాలో 240 మంది బూత్ కన్వీనర్‌లు ఉండగా గుంటూరు పశ్చిమ నుండి 125 మందిని శిక్షణా తరగతులకు ఆహ్వానించినట్లు తెలిపారు. నియోజకవర్గానికి సంబంధించి బూత్ కన్వీనర్‌లను రెండు బ్యాచ్‌లు విభజించి శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. సేవామిత్ర అనే నామకరణ చంద్రబాబు నాయుడు మనస్సు నుంచి వచ్చిందని, అది ఆయన మానసపుత్రులుగా అభివర్ణించినట్లు గుర్తుచేశారు. ప్రతి 100 ఓటర్లకు ఒక సేవామిత్ర, ప్రతి 10 సేవామిత్రలకు ఒక బూత్ కమిటీ కన్వీనర్ ఉంటారన్నారు. సేవామిత్రలు తెలుగుదేశం పార్టీకి సైనికుల్లాంటి వారని తెలిపారు. పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేయడంలో సేవమిత్రల పాత్ర కీలకమైందన్నారు. నరేంద్రమోదీ వెంకన్న సాక్షిగా ఢిల్లీని తలదనే్న రాజధానిని నిర్మిస్తామని చెప్పి నాలుగేళ్ల తర్వాత నమ్మించి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం 29 సార్లు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లినా కనికరించలేదని, ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీ అంటూ నమ్మబలికి చివరకు అరకొర నిధులు ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. 2018-19 కేంద్రబడ్జెట్ చూస్తే కేంద్రప్రభుత్వ నిజస్వరూపం కన్పిస్తుందన్నారు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ 2029 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఉంచేందుకు అనునిత్యం శ్రమిస్తున్న నారా చంద్రబాబునాయుడు ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 3.25 లక్షల మందికి శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. చంద్రబాబు ప్రతిశ్వాస రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాజధాని నిర్మాణం ప్రజల సంక్షేమం కోసమేనన్నారు. నరేంద్రమోదీ దేశంలో 6.5 శాతం అభివృద్ధి సాధిస్తే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం 11.5 శాతం అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు దాసరి రాజామాస్టారు, దారపనేని నరేంద్ర, తెలుగుదేశం పార్టీ నాయకులు, బూత్ కన్వీనర్‌లు పాల్గొన్నారు.