గుంటూరు

ఉపాధి హామీ నిధులతో గ్రంథాలయాల ఆధునీకీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేబ్రోలు, జూన్ 21: ఉపాధి హామీ నిధులతో పాత గ్రంథాలయాల ఆధునికీకరణ, కొత్త గ్రంథాలయాల నిర్మాణం చేపట్టనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్శిటీలో గురువారం జరిగిన రాష్ట్ర గ్రంథాలయాల అధికారుల వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ గుంటూరులో 5 కోట్ల రూపాయలతో అతిపెద్ద డిజిటల్ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గ్రంథాలయాల అధికారులు పాఠకుల సంఖ్యను పెంచాలని సూచించారు. నిరుద్యోగ యువతకు కావాల్సిన పుస్తకాలను గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ దాసరి రాజా మాస్టారు మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రంథాలయాలకు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, తదితర సంస్థల నుంచి ఇప్పటికి 340 కోట్ల రూపాయలకు పైగా సెస్సు రూపంలో రావాల్సి ఉందన్నారు. గ్రంథాలయాల ఉద్యోగులకు 010 పద్దు కింద వేతనాలు చెల్లించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ పి పార్వతి మాట్లాడుతూ ప్రభుత్వాలు గ్రంథాలయాల అభివృద్ధి, నిర్వహణకు ఎలాంటి నిధులు కేటాయించడం లేదని, నానాటికీ గ్రంథాలయాలకు వచ్చే పాఠకుల సంఖ్య కూడా తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రంథాలయ సిబ్బంది విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయన్నారు. గ్రంథాలయాలను సమర్ధవంతంగా నిర్వహించి అభివృద్ధి విజ్ఞానంతోనే సాధ్యమని గ్రంథాలయ అధికారులు నిరూపించాలని కోరారు.