గుంటూరు

విద్య నేర్వనిదే సమాజాభివృద్ధి సాధ్యం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజారు), జూలై 17: విద్య నేర్వనిదే సమాజాభివృద్ధి సాధ్యం కాదని లోక్ అదాలత్ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎల్ తేజోవతి పేర్కొన్నారు. మంగళవారం పెదపలకలూరులోని శ్రీ చైతన్య స్కూల్ ప్రాంగణంలో ఎన్‌ఆర్‌ఐ యేరువ సాయిరాం స్థాపించిన యేరువ కోటిరెడ్డి మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా 42 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 1500 మంది ప్రతిభ గల పేద విద్యార్థులకు, ఇంటర్, బిటెక్, మెడిసిన్ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు 45 లక్షల రూపాయల ఉపకార వేతనాలను అందించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ట్రస్ట్ కన్వీనర్ పోలూరి వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి తేజోవతి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివినప్పుడే ఉన్నత లక్ష్యాలను అధిగమిస్తారన్నారు. సమాజంలో ఎవరు ఏ స్థాయిలో ఉన్నా ఎంత సంపాదించినా దానం చేసే గుణం కొందరికే ఉంటుందన్నారు. ట్రస్ట్ కన్వీనర్ యేరువ సాయిరాం మాట్లాడుతూ అన్నీ దానాల్లో కెల్లా విద్యాదానమే గొప్పదని భావించామని, ఈ మేరకు విద్యార్థులకు చేతనైన మేరకు చేయూతనందిస్తున్నట్లు వివరించారు. ట్రస్ట్ కన్వీనర్ పోలూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ గత రెండు దశాబ్దాలుగా పెదపలకలూరులో పేద విద్యార్థులకు ట్రస్ట్ ద్వారా సాయిరాం ఉపకార వేతనాలను అందిస్తూ ఎందరికో ఆదర్శంతంగా నిలుస్తున్నారన్నారు. అనంతరం న్యాయమూర్తి తేజోవతి చేతుల మీదుగా స్కాలర్‌షిప్‌లను అందజేశారు. ఈకార్యక్రమంలో వరప్రసాదరావు, ప్రభాకరరెడ్డి, చెంచమ్మ, నూనె వెంకట కోటిరెడ్డి, యేరువ జగధీశ్వరి, యేరువ త్రివేణి, పోలూరి గౌతమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కన్నా మాటల్లో నిజాలు సున్నా
గుంటూరు, జూలై 17: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని, ఆయన బీజేపీలో చేరిన నాటి నుండి నేటి వరకు ఒక్క నిజం కూడా మాట్లాడలేదని ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. మంగళవారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడారు. అబద్ధాలు చెప్తున్న బీజేపీపై ప్రజలు తిరుగుబాటు చేపట్టారన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని, అందుకే దేశ, విదేశాల నుండి పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పారిశ్రామిక వేత్తలు వస్తున్నారన్నారు. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో రాష్ట్రానికి ప్రథమస్థానం లభించిన విషయాన్ని బీజేపీ నేతలు మరిచినట్లున్నారన్నారు. రమణ దీక్షితులను పావుగా వాడుకుని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు యత్నించారని ఆరోపించారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు సీఎంగా ఉన్న రాష్ట్రంలో బీజేపీ కుట్రలు, కుతంత్రాలు సాగవన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందని, నేరస్తులు, అవినీతి పరులపై చంద్రబాబు ఉక్కుపాదం మోపుతున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు అభద్రతాభావంతో జీవనం సాగిస్తున్నారన్నారు. బ్యాంకింగ్ రంగాన్ని చంద్రబాబు కుప్పకూల్చారని కన్నా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. నోట్ల రద్దుతో బ్యాంకింగ్ రంగాన్ని, ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టింది మోదీ అన్న విషయం దేశ ప్రజలందరికీ తెలుసన్నారు. ఇకనైనా కన్నా వాస్తవాలు గ్రహించి మాట్లాడితే బాగుంటుందని హితవుపలికారు.