గుంటూరు

తిలాపాపం.. తలా పిడికెడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 15: సెల్లార్ పునాది పనుల్లో ఏడుగురు యువకులు ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన వెనుక అడుగడుగునా నిర్లక్ష్యం చోటు చేసుకుంది.. తిలా పాపం.. తలా పిడికెడు అన్నట్లుగా ఈ సంఘటనకు బాధ్యులనేక మంది ఉన్నట్లు గుర్తించారు.. మట్టిపెళ్లల కింద సమాధి అయిన వారి మృతదేహాలను అతికష్టంమీద ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఆదివారం తెల్లవారుఝాము సమయానికి వెలికితీశారు. మృతదేహాలకు జీజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించారు. మృతులలో ఒక్కొకరిదీ ఒక్కో దీనగాథ. ఉన్నత చదువుల కోసం తాపత్రయపడుతూ రెక్కల కష్టంతో విద్యనభ్యసించాలనే పట్టుదలతో ఉన్న ఐదుగురు విద్యార్థులు సైతం ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవటంతో ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడులో విషాదఛాయలు నెలకొన్నాయి. ప్రమాదం పొంచి ఉందనే విషయాన్ని నెలరోజులుగా కార్మికులు వివరిస్తున్నా బిల్డర్లు అశ్రద్ధ వహించటం ఓ కారణం కాగా.. గ్రిల్స్ ఏర్పాటు చేయకపోవటం మరో తప్పిదం.. అన్నింటికీ మించి భూసార పరీక్ష జరిపి పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటం వల్ల నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి. మృతులు బత్తుల రాజేష్, బత్తుల సునీల్, సలో మన్, జొన్నలగడ్డ ప్రశాంత్, శేషుబాబు, తురకా రాకేష్‌ల కుటుంబ సభ్యులు జీజీహెచ్ మార్చురీ వద్దకు చేరుకున్నారు. ఎవరి ఓదార్పులు.. పరామర్శలు వారికి పట్టలేదు.. చేతికి అందివచ్చిన కొడుకులు కళ్లెదుటే విగతజీవులుగా మారటాన్ని తట్టుకోలేక నిశే్చష్టులయ్యారు. తరచు ఇలాంటి సంఘటనలు జరగటం ప్రభుత్వం నజరానాలు ప్రకటించి చేతులు దులుపుకోవటం రివాజుగా మారుతోంది. గత కొనే్నళ్ల క్రితం డొంకరోడ్డులో నారాయణ విద్యాసంస్థలకు సంబంధించి లీజుకు తీసుకున్న భవన నిర్మాణ పనుల సందర్భంగా ఇదే రకంగా పలువురు మృత్యువాత పడ్డారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం పూర్తిస్థాయిలో అందలేదు. లక్ష్మీపురంలో సెల్లారుకు అన్ని అనుమతులు ఉన్నాయని జీవోలతో సహా వివరించే నగరపాలక సంస్థ అధికారులు నగరంలో ఎన్ని అనధికారిక కట్టడాలు ఉన్నాయనేది గ్రహించాల్సి ఉంది. విద్యా సంస్థలకు సైతం సెట్‌బ్యాక్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేసి ముడుపులు తీసుకున్నారనేది బహిరంగ రహస్యం. ముందు అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిన యంత్రాంగం మామూళ్లకు అలవాటు పడినందునే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయనేది స్పష్టమవుతోంది. లక్ష్మీపురం ఘటనతో పరిసర ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్ధపునీరు చేరటం వల్ల మట్టిపెళ్లలు విరిగిపడ్డాయనే సరికొత్త వాదన ముందుకొస్తోంది. ఏది ఏమైనా ముందు జాగ్రత్తలు చేపట్టటంలో అధికార యంత్రాంగం విఫలమైందనే విమర్శలు సర్వత్రా చోటుచేసుకున్నాయి.. ఇందుకు మరో కారణం లేకపోలేదు. నిర్మాణం జరిగే భవనంలో రాజకీయ నేతలకు బినామీ పేర్లతో భాగస్వామ్యం ఉండటమే అని చెప్తున్నారు. ప్రముఖులకు సంబంధించిన భవనం కనుక శరవేగంతో అనుమతులు మంజూరయ్యాయనే ఆరోపణలు వినవచ్చాయి. తాజా ఘటనలో ఓ బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేయటంతో పాటు బిల్డరు లైసెన్స్‌ను రద్దుచేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉంది.