గుంటూరు

రెండు కోట్లతో సబ్ స్టేషన్‌కు శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నకరికల్లు, ఆగస్టు 14: మండల పరిసర గ్రామాల ప్రజల, రైతుల విద్యుత్ సమస్యలను పరిష్కరించడంలో భాగంగా మండలంలోని గుళ్ళపల్లి గ్రామంలో రెండు కోట్ల రూపాయల వ్యయంతో సబ్ స్టేషన్ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా మంగళవారం గుళ్ళపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.33/11కేవీ సబ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు, ఓటుబ్యాంకుకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. గుళ్లపల్లి సబ్‌స్టేషన్ ద్వారా లోఓల్టేజి సమస్య తీరిపోవడమే కాక, బోర్లపై ఆధారపడి వ్యవసాయం కొనసాగిస్తున్న రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందచేయడం జరుగుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నుండి తెనాలి వరకు నీరు లభ్యమవుతుందని, గోదావరి జలాలను వైకుంఠపురం వద్ద లిఫ్ట్‌ద్వారా సాగర్ కుడి కాలువకు కలిపి, మిగిలిన ప్రాంతాలకు కూడా తాగు, సాగు నీరు కొరత లేకుండా సరఫరా అయ్యేలా చూస్తామన్నారు. ఇప్పటి వరకు గుళ్ళపల్లి గ్రామాన్ని 26కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ది చేశామన్నారు. అర్హులైన అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రతినెల అక్టోబర్ రెండో తేదీన గ్రామస్థులు అందరూ కల్సి శ్మశానాలను శుభ్రపరుచుకోవాలన్నారు. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో విద్యుత్ సమస్యను తీర్చేందుకు అడిగిన వెంటనే అవసరమైన విద్యుత్ సబ్ స్టేషన్, ట్రాన్స్‌ఫార్మర్, విద్యుత్ ఉపకరణాలను మంజూరు చేసిన సీఎండీ ఎంఎం నాయక్‌కు అభినందనలు తెలిపారు. విద్యుత్ శాఖ ఎస్‌ఈ జయభారతరావు మాట్లాడుతూ రెండు నెలల్లో విద్యుత్ సబ్ స్టేషన్ పనులు పూర్తిచేసి, విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే గ్రామాల్లో లోఓవోల్జేటి సమస్యను తీర్చేందుకు 150ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఎక్కడన్నా మిగిలిపోయి ఉన్న టపా ట్రాన్స్‌ఫార్మర్లను తొలగించి, వాటి స్థానంలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డీఈ శ్రీనివాసబాబు, ఏడీఈ రాజారాం, డిఈ కన్‌స్ట్రక్షన్స్ సుధాకర్, ఏడి రాజశేఖర్, సురేష్, తహశీల్దార్ నాగేశ్వరరావు, ఈవోపిఆర్‌డీ విజయకుమార్, ఎంపీపీ కొర్రా లక్ష్మీభాయి, మాజీ సర్పంచ్ శ్యామలా నాయక్, టీడీపీ అధ్యక్షుడు అహ్మద్‌బుడే, సంగుల కొండలు, సాగి కోటేశ్వరరావు, కరాలపాటి వలి, బాషా తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన వ్యవసాయ డిప్లొమా కౌనె్సలింగ్
తాడికొండ, అగస్టు14: ఆచార్య ఎన్‌జిరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో వ్యవసాయ డిప్లొమా కౌన్సిలింగ్‌లో 116 సీట్లు భర్తీ చేసినట్లు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి వల్లభనేని దామోదర నాయుడు మంగళవారం తెలిపారు. వ్యవసాయ పాలిటెక్నిక్‌లో 77, విత్తన సాంకేతిక పరిజ్ఞానంకు 17, సేంద్రియ వ్యవసాయంకు 4, వ్యవసాయ ఇంజనీరింగ్‌కు 18 సీట్లుకేటాయించామన్నారు. ఈ కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి శివశంకర్, డీన్ అఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డాక్టరు యల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ హేమ, జాయింట్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ప్రత్యేక హోదాతోనే అభివృద్ధి సాధ్యం
రేపల్లె, ఆగస్టు 14: కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు. మంగళవారం స్థానిక ఎంసీఏ హాల్‌లో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా - విభజన హమీలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో డీసీసీబీ చైర్మన్ ముమ్మనేని వెంకట సుబ్బయ్య, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్, ఎంసీఏ అధ్యక్షుడు డాక్టర్ వి ప్రకాశరావు, జి హానుమంతరావు, ఎస్ విశ్వనాథ్, సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.

గ్రీవెన్స్ భవనానికి విరాళం
గుంటూరు (కొత్తపేట), ఆగస్టు 14: గుంటూరు అర్బన్ పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ భవన నిర్మాణానికి గుంటూరు మార్కెట్ యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు25 లక్షల రూపాయల చెక్కును మంగళవారం అర్బన్ ఎస్‌పి విజయారావుకు అందజేశారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ ప్రతి సోమవారం పరిసర గ్రామాల నుండి రైతులు, గ్రామీణ ప్రాంతాల పేదలు తమ సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ సెల్‌కు వస్తుంటారన్నారు. ఎస్‌పి విజయారావు చేపట్టిన భవన నిర్మాణానికి మార్కెట్ కమిటీ నుండి నిధులు కేటాయించాలని కోరగా, 27 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. అర్బన్ ఎస్‌పి విజయారావు మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ పట్ల మన్నవకు అపారమైన నమ్మకం ఉందని, గ్రీవెన్స్ సెల్‌కు వచ్చే ప్రజల అసౌకర్యాన్ని వివరించగా ఈ మేరకు స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఎస్‌పి వైటి నాయుడు, డిఎస్‌పి మూర్తి, యార్డు కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.