గుంటూరు

ఆన్‌లైన్‌లో కాకిలెక్కలు చూపితే చర్యలు తప్పవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, మే 17: తెనాలి వైద్యశాలకు సంబంధించిన గణాంకాలను కాకిలెక్కలు చూపుతూ అసత్యాలను ఆన్‌లైన్‌లో పొందుపురుస్తున్నారని వైద్య ఆరోగ్యశాఖ జిల్లా గణాంకాధికారి నాగమల్లేశ్వరావు పిహెచ్‌సి, తెనాలి జిల్లా వైద్యశాల సిబ్బందిని హెచ్చరించారు. మంగళవారం తెనాలి జిల్లా వైద్యశాలలో వైద్యులు, క్లస్టర్ పరిధిలోని ఆరోగ్య సిబ్బంది, వైద్యులతో ఆయన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో అమలుజరుగుతున్న ప్రజలకు అందుతున్న వైద్యసేవలు, పరికరాల కొనుగోళ్ళు, ఇతర సమాచారం ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరచాల్సిఉండగా అసంబద్ధమైన లెక్కలు నమోదు చేస్తారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2015 జూన్‌లో ఒక్క ఓపి కూడా లేదని ఆన్‌లైన్‌లోచూపి రికార్డుల్లో 10వేల మందికి వైద్యసేవలు అందించినట్లు రాశారన్నారు. ఇందులో ఏది నిజమో... ఏది అబద్ధమో అంకెల గారడీచేసిన వారికే తెలియాలని చురకలు వేశారు. అలాగే 120మంది మహిళలకు ఏప్రిల్ 2015లో కాన్పులు చేయగా 60 మందికి మాత్రమే మొర్రుపాలు పట్టినట్లు చూపారన్నారు. మిగిలిన వారి పరిస్థితి ఏమిటంటూ అందరికీ పాలు పట్టే విధంగా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన సిబ్బందిని ప్రశ్నించారు. కంటి వైద్యానికి చెందిన ఐఓఎల్ ఆపరేషన్లు చేయడానికి విజయవాడ మినహా ఎక్కడా వైద్యుడు లేకున్నా... తెనాలి జిల్లా ఆసుపత్రిలో ఐఎల్‌ఓ ఆపరేషన్లు చేసినట్లు ఆన్‌లైన్‌లో లెక్కలు నమోదుచేస్తారా అంటూ నిలదీశారు. కేంద్ర వైద్యశాఖ నుండి నిధులు రాబట్టేందుకు ఇటువంటి అక్రమ లెక్కలువ్రాస్తే... నిజనిర్ధారణలో అవి తప్పులని ఎంచబడితే ఉన్న నిధులను కూడా నిలుపుదలచేసే అవకాశం లేకపోలేదని హెచ్చరించారు. సక్రమంగా ఏరోజుకు ఆరోజు రోజవారీగా వైద్యసేవలు, పరికరాల కొనుగోళ్ళు వంటి వివరాలు నిజాయితీగా పొందుపరచాలని, లేకుంటే ఆసుపత్రికి కేంద్రం నుండి వచ్చే నిధుల్లో 10శాతం నిధులు కోతపడే అవకాశం ఉందని ఆయన సిబ్బందికి సూచించారు. ఇప్పటికైనా నిజమైన లెక్కలను ఈనెల 5లోగా ఆన్‌లైన్‌లో పొందుపరచాలని ఆయన చెప్పారు. ఈసమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఈశ్వరప్రసాద్, ఇమ్యునైజేషన్ డిఎస్‌ఓ టి నరసింహులు, ఎఓ శ్రీనివాస్, ఆర్‌ఎంఓ సురేష్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.