గుంటూరు

ప్రజా సమస్యల పరిష్కారానికే గ్రామదర్శిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేబ్రోలు, అక్టోబర్ 14: ప్రజా సమస్యల పరిష్కారానికే గ్రామదర్శిని కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతోందని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అన్నారు. మండల పరిధిలోని శేకూరుపాలెంలో ఆదివారం సాయంత్రం గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. శేకూరుపాలెంలోని ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ప్రధానంగా ట్రాన్స్‌ఫార్మర్‌లు పాడైపోయి ఎన్నో ఏళ్లుగా విద్యుత్ సమస్య నెలకొందని మహిళలు వివరించారు. అలాగే ఇళ్లు నిర్మించుకున్న వారికి బిల్లులు సకాలంలో రావడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే నరేంద్రకుమార్ వెంటనే హౌసింగ్ బిల్లులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ట్రాన్స్‌ఫార్మర్లకు రిపేర్లు నిర్వహించి అవసరమైన చోట్ల కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసి విద్యుత్ సమస్యను పరిష్కరించాలన్నారు. శేకూరుపాలెం, శేకూరు వెళ్లే గ్రామాల మధ్య కొమ్మమూరు ఛానల్‌పై నడిచే బల్లకట్టును వెంటనే నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేయించాలని స్థానిక అధికారులకు సూచించారు. అనంతరం శేకూరుపాలెంలో కొత్తగా నిర్మించనున్న మూడు సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ సీనియర్ నేత వాసిరెడ్డి ఉదయభాస్కరరావు పాల్గొన్నారు.

సాగర్‌కు పోటెత్తిన పర్యాటకులు
విజయపురిసౌత్, అక్టోబర్ 14 : ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌కు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. దసరా పండుగ సందర్భంగా కళాశాలలు, పాఠశాలలకు సెలవులు ప్రకటించటంతో ఆదివారం ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున సాగర్‌కు పర్యాటకులు చేరుకున్నారు. సాగర్‌లోని పలు సుందర దృశ్యాలను తిలకించిన పర్యాటకులు నాగార్జునకొండను చూసేందుకు లాంచీస్టేషన్ వద్ద బారులు తీరారు. దీంతో లాంచీస్టేషన్ ఆదాయం సుమారు రూ 1.20 లక్షలకు చేరినట్లు స్టేషన్ అసిస్టెంట్ మేనేజర్ సూర్యచంద్రరావు తెలిపారు. అలాగే ఆదివారం కావటంతో కృష్ణాతీరాన వెలసిన సాగర్‌మాత పుణ్యక్షేత్రానికి భక్తులు శనివారం రాత్రికే చేరుకున్నారు. ఆదివారం పవిత్ర కృష్ణానదిలో స్నానాలాచరించి భక్తులు తలనీలాలు సమర్పించుకొని జపమాల క్షేత్రంలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఆలయ విచారణ గురువులు ఫాదర్ హృదయకుమార్ భక్తులకు దీవెనలు అందించి ప్రసంగిస్తూ ఏసుక్రీస్తు బోధనలు పాటించి తోటి వారికి చేతనైన సహాయం చేయాలన్నారు. కరుణ, శాంతి కలిగి ఉండి ప్రతి ఒక్కరిని ప్రేమించాలన్నారు.