గుంటూరు

పంటలను కాపాడతామన్న భరోసా రైతులకు కల్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 15: సాగునీటి విడుదలపై ఖచ్చితమైన గణాంకాలతో, నిర్దిష్టమైన ప్రణాళికలతో ముందుకుపోతున్న విషయాలన్నీ క్షేత్రస్థాయిలో రైతులకు తెలియజేయడంతో పాటు వేసిన పంటలను కాపాడుతామన్న భరోసా వారిలో కల్పించాల్సిన బాధ్యత వ్యవసాయ, జలవనరులు, రెవెన్యూ అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ స్పష్టంచేశారు. గురువారం సాగునీటి అంశంపై రోజువారీ సమీక్షలో భాగంగా కలెక్టర్ శశిధర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాగార్జున సాగర్ కుడికాల్వ పరిధిలో, కృష్ణా పశ్చిమ డెల్టాలో పంటల పరిస్థితి, సాగునీటి విడుదల తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. వారాబందీ విధానంపై క్షుణ్ణంగా మేజర్, మైనర్ బ్రాంచ్ కెనాల్స్ వారీగా వ్యవసాయ, జలవనరులు, రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. ఎన్‌ఎస్‌పి ఇంజనీరింగ్ అధికారులు రూపొందించిన వారాబందీ విధానం, ఏ ఛానల్ ద్వారా ఎంత నీరు విడుదల చేస్తున్నారు, ఏ మేరకు సాగునీరు అవసరం, సాగులో ఉన్న పంటల వివరాలు వంటివి తప్పనిసరిగా అధికారులు పూర్తిస్థాయిలో అవగాహన చేసుకోవాలన్నారు. ఈ వివరాలన్నీ రైతులకు, సాగునీటి వినియోగదారుల సంఘాల సభ్యులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. తద్వారా వారిలో ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. సాగునీటిని సమర్ధవంతంగా ఖచ్చితమైన గణాంకాలతో వినియోగించుకుని ఏ ఒక్క ఎకరా పంట నష్టపోకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎక్కడైనా సమస్య ఏర్పడితే వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్, వ్యవసాయ శాఖ జెడి కార్యాలయం నుండి ఎన్‌ఎస్‌పి ఎస్‌ఇ గంగరాజు, కెడబ్ల్యుడి ఎస్‌ఇ బాబురావు, వ్యవసాయ శాఖ జెడి విజయభారతి, మండల రెవెన్యూ కార్యాలయాల నుండి క్షేత్రస్థాయి అధికారులు పాల్గొన్నారు.