గుంటూరు

అమరావతిని సందర్శించిన విదేశీ పాత్రికేయులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 16: విజయవాడలో జరుగుతున్న ప్రపంచ స్థాయి పడవల పోటీల వార్తలు, ఛాయాచిత్రాలను అంతర్జాతీయ పత్రికలకు అందించేందుకై ఇక్కడకు వచ్చిన అంతర్జాతీయ పాత్రికేయులు శుక్రవారం అమరావతిని సందర్శించారు. పోలెండ్ దేశానికి చెందిన తోమజ్ పఠాన్, జోరే, జార్జియా దేశానికి చెందిన నికాలే, బనిజ్జులు తదితరులు అమరావతికి విచ్చేసి మహాస్థూపం, ధ్యానబుద్ధ ప్రాజెక్టు, పురావస్తు సంగ్రహాలయాలను సందర్శించారు. విజయవాడ కల్చరల్ సెంటర్ సిఇఒ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఈ బృందానికి గైడ్‌గా వ్యవహరించి అమరావతి విశేషాలను వివరించారు.

ట్రాఫిక్ నియంత్రణకు బారికేడ్లు ఏర్పాటు
పొన్నూరు, నవంబర్ 16: రోడ్డు మార్జిన్‌లు సైతం ఆక్రమణలకు గురై ఇరుకుగా మారి ట్రాఫిక్ సమస్య జఠిలంగా ఉన్న పొన్నూరు పట్టణంలో ఆ సమస్యను కొంతమేరకు నియంత్రించేందుకు అనువుగా ఇక్కడి లిఖిత్‌సాయి అమర్ కంటి, పిల్లల ఆసుపత్రి వైద్యులు భారికేడ్‌లను అందజేసి పోలీసులకు శిరోభారాన్ని తగ్గించారు. ఆసుపత్రికి చెందిన డాక్టర్ మనె్న చంద్రశేఖర్, డాక్టర్ శ్రీలత దంపతులు 5 ట్రాఫిక్ భారికేడ్లను పొన్నూరు టౌన్ ఎస్‌ఐ కిషోర్‌బాబుకు శుక్రారం అందజేశారు.
వీటిని పట్టణ పురవీధుల్లో ఏర్పాటు చేయడం ద్వారా ట్రాఫిక్ సమస్య కొంతమేరకు సర్ధుబాటు కావడంతో సంతోషించిన అర్బన్ ఎస్‌ఐ కిషోర్‌బాబు, పోలీసు సిబ్బంది వైద్య దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.