గుంటూరు

సమన్వయంతో పనిచెయ్యాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడికొండ, నవంబర్ 17: తాడికొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచెయ్యాలని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ అన్నారు. శనివారం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువచేయడంతోపాటు తెలుగుదేశం ప్రభుత్వంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సేవామిత్ర, బూత్ కమిటీ సభ్యులు తప్పని సరిగా పార్టీ శిక్షణ తరగతులకు హాజరు కావాలని, పార్టీ సభ్యత్వ నమోదుపై పార్టీ శ్రేణులతో చర్చించిన ఎమ్మెల్యే పార్టీ లక్ష్యాలకు అనుగుణంగా గ్రామ నాయకత్వం సభ్యత్వ నమోదు, రెన్యూవలు చేయించుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 26వ తేదిన తాడికొండలో నిర్వహించనున్న రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని విజయవతం చెయ్యాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఫిరంగిపురం, మేడికొండూరు, తుళ్ళూరు మండల పార్టీ అధ్యక్షుడు డేగల ప్రభాకరరావు, మల్లిపెద్ది రమేష్, ధనేకుల సుబ్బారావు, ఫిరంగిపురం తాడికొండ మార్కెట్ యార్డ్ చైర్మన్లు నార్నె శ్రీనివాసరావు, గుంటుపల్లి మధుసూదనరావు, మేడికొండూరు, తుళ్లూరు జెడ్పీటీసీలు గుంటుపల్లి సాంబశివరావు, బెజవాడ నరేంద్రబాబు, తుళ్ళూరు, తాడికొండ, మేడికొండూరు ఎంపిపిలు వడ్లమూడి పద్మలత, షేక్ రిజ్వానా జిలానీ, మార్తా శ్రీనివాసరావు, జిల్లాపార్టీ కార్యాలయ కార్యదర్శి కంచర్ల శివరామయ్య, బెల్లంకొండ నరసింహారావు, పాములపాటి శివన్నారాయణ, నూతలపాటి రామారావు, రావెల గోపాలకృష్ణ, బత్తుల కోటేశ్వరరావు, గడ్డం మార్టిన్ తదితరులు పాల్గొన్నారు.

స్ట్ఫా నర్సులు, హెడ్ నర్సులకు పదోన్నతులు కల్పించాలి
* వెల్లంపల్లి పద్మజ
గుంటూరు (అరండల్‌పేట), నవంబర్ 17: రీజనల్ పరిధిలోని ఆసుపత్రులలో పనిచేస్తున్న స్ట్ఫా నర్సులు, హెడ్ నర్సులకు సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వ నర్సుల సంఘం రాష్ట్ర అడహక్ కమిటీ సభ్యురాలు వెల్లంపల్లి పద్మజ అన్నారు. శనివారం రాష్ట్ర అడహక్ కమిటీ ఆధ్వర్యంలో రీజనల్ డైరెక్టర్ డాక్టర్ ఉమామహేశ్వరిని కలసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి పద్మజ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి పదోన్నతులు కల్పించక పోవడంతో నర్సులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని ఉద్యోగ పదోన్నతులు లేక స్ట్ఫానర్సులు హెడ్ నర్సులుగానే పదవీ విరమణ పొందుతున్నారన్నారు. సర్వీస్ సీనియారిటీ ప్రకారం రీజనల్ పరిధిలో పనిచేస్తున్న స్ట్ఫా నర్సులు, హెడ్ నర్సులకు పదోన్నతులు కల్పించాలని ఆర్డీని కోరామన్నారు. అదేవిధంగా గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు కానున్న గైనకాలజీ విభాగంలో శాశ్వత ప్రాతిపాదికన భర్తీ చేయనున్న పోస్టులకు కూడా సీనియార్టీని పరిగణలోకి తీసుకొవాలని కోరినట్లు తెలిపారు. 9మంది హెడ్ నర్సులు, 21మంది స్ట్ఫా నర్సుల నియామకంలో కాంట్రాక్ట్ ప్రాతిపాదికన పనిచేస్తున్న నర్సుల సీనియార్టీని గుర్తించాలని కోరామన్నారు. పోస్టుల భర్తీకి ఆర్డీ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఆర్డీకి వినతిపత్రం అందించిన వారిలో బెల్లంకొండ శైలజ, టి భూలక్ష్మి, విశ్వ శాంతీ ప్రసన్న, అరుణకుమారి, అన్నపూర్ణ, నిర్మల జ్యోతి, వి అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.