గుంటూరు

భూ సేకరణ కుదరదు... రైతులకు ఆందోళనొద్దు: ఆర్కే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, మే 22: సమీకరణకు భూములివ్వని రైతుల భూములను భూ సేకరణ ద్వారా ప్రభుత్వం తీసుకోవడం కుదరదని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ధైర్యంగా ఉండాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) భరోసా ఇచ్చారు. ఆదివారం బేతపూడి గ్రామంలో రైతులతో సమావేశమైన ఎమ్మెల్యే ఆర్కే భూ సేకరణపై గ్రామసభలందు ప్రభుత్వం రైతులను భయాందోళనకు గురిచేసి సమీకరణకు ఇచ్చే విధంగా ప్రచారం జరుపుతోందని, 2013 భూ సేకరణ చట్టంలో మూడుపంటలు పండే భూములను సేకరించరాదని స్పష్టంగా ఉందని, దాన్ని మార్చేందుకు చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చారని, చంద్రబాబు మాటలు నమ్మి చట్టం మార్చేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నించి విఫలమయిందని, రైతుల్లో వ్యతిరేకత వస్తుందని భావించి చట్టం చేయలేదని ఆర్కే వివరించారు. 2013 చట్టప్రకారం భూ సేకరణ జరిపితే ఒక్కో రైతులు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఎకరానికి 5 నుంచి 6 కోట్ల రూపాయలు చెల్లించడంతో పాటు ఇంటికో ఉద్యోగం, అభివృద్ధి చేసిన స్థలంలో ఎకరానికి 20 శాతం ఇవ్వాలని ఆయన అన్నారు. భూ సేకరణ కొరకు నిర్వహిస్తున్న గ్రామసభలను సామాజిక ప్రభావ అంచనా అధ్యయన పేరుతో నిర్వహించాల్సి ఉండగా ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడం వెనుక ఉద్దేశ్యాన్ని రైతులు గ్రహించాలన్నారు. ప్రభుత్వ బెదిరింపులకు రైతులెవరూ లొంగవద్దని, ఇప్పటికే కోర్టులు రైతులకు అనుకూలంగా తీర్పునిచ్చాయని, వాటిని ఉల్లంఘిస్తే మళ్లీ కోర్టును ఆశ్రయించి రైతులందరికీ న్యాయం జరిగే వరకు అండగా ఉండి తాను పోరాడతానని ఎమ్మెల్యే ఆర్కే హామీ ఇచ్చారు. రైతులు వెంకటేశ్వర్లు, మల్లిఖార్జునరావు, సుబ్బారావు, వైసీపీ నాయకులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, మండెపూడి యోహాను, గాదె సాగర్‌రెడ్డి పాల్గొన్నారు.