గుంటూరు

19 నుంచి కోటప్పకొండ పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 11: కోటప్పకొండ పండుగను ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. మంగళవారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో స్పీకర్ కోడెల మాట్లాడుతూ విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నంలో బీచ్ బెస్టివల్స్‌ను నిర్వహించడం జరిగిందన్నారు. వినూత్నంగా భారతదేశంలో ఒక కొండ పండుగను వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. కొండ పండుగ నిర్వహణకు కమిటీ ఏర్పాటుచేశామని, కమిటీలో మంత్రులు, కలెక్టర్, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు సభ్యులుగా ఉంటారన్నారు. జనవరి 19,20,21 తేదీల్లో జరిగే ఈ పండుగను తొలిరోజు భారత ఉపరాష్టప్రతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రారంభిస్తారని, 20వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, 21వ తేదీ ఉప ముఖ్యమంత్రి, మంత్రులు పాల్గొంటారన్నారు. ఈ పండుగ మూడు రోజుల్లో పర్యావరణాన్ని కాపాడటం, అడవులు, జీవరాశులను కాపాడటం, కాలుష్యాన్ని నివారించడంతో పాటు అడవులపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. కొండ పండుగకు సంబంధించి ముఖ్యమైన మూడు అంశాలను చేపట్టడం జరుగుతుందన్నారు. పుణ్యక్షేత్రాలు, పర్యావరణ కేంద్రాల అభివృద్ధి, పచ్చదనం పెంపొందించడం, రోప్‌వే నిర్మాణం, పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేసి ఆకర్షణీయమైన వసతులు ఏర్పాటు చేయడం, పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమాలుగా నిర్వహించడం జరుగుతుందన్నారు. 18 సంవత్సరాల నుండి కోటప్పకొండ అభివృద్ధికి అందరూ కృషి చేస్తున్నారని, గతంలో ఆదాయం సంవత్సరానికి 8 లక్షలు కాగా, ప్రస్తుతం 11 కోట్ల రూపాయలకు పెరిగిందని స్పీకర్ వెల్లడించారు. మూడు రోజుల పండుగకు వౌలిక వసతులతో పాటు ఫుడ్ ఫెస్టివల్‌ను నిర్వహించడం జరుగుతుందన్నారు. రోప్‌వే నిర్మాణం శివరాత్రి పర్వదినం నాటికి పూర్తవుతుందన్నారు. రానున్న కాలంలో కోటప్పకొండ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుందని కోడెల ఆశాభావం వ్యక్తంచేశారు.