గుంటూరు

ఎనె్నస్సెస్ యువజనోత్సవాల్లో సత్తా చాటిన నాగార్జున

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున యూనివర్సిటీ, డిసెంబర్ 14: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గత రెండు రోజులుగా జరుగుతున్న ఎనె్నస్సెస్ రాష్టస్థ్రాయి యువజనోత్సవాలలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులు తిరుగులేని సత్తా చాటి ఓవరాల్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీని గెలుచుకున్నారు. రాజమండ్రి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ విద్యార్థులు రెండవ స్థానంలో నిలిచి రన్నరప్ ట్రోఫీని అందుకున్నారు. గత రెండురోజులుగా వివిధ అంశాలలో జరిగిన పోటీలలో విజేతలుగా నిలిచిన వారి వివరాలను పోటీల కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ పిపిఎస్ పాల్‌కుమార్ వెల్లడించారు. వ్యాసరచన పోటీలో నాగార్జున వర్సిటీకి చెందిన సాఫియా మొదటిస్థానం, ఆదికవి నన్నయ వర్సిటీకి చెందిన ఎం సతీష్ రెండవ స్థానం సాధించారని ఆయన తెలిపారు. క్లాసికల్ డాన్స్ అంశంలో అనంతపురంకు చెందిన జె ఎన్‌టియు వర్సిటీకి చెందిన విద్యార్థులు మొదటిస్థానం సాధించగా, నాగార్జున వర్సిటికీ చెందిన విద్యార్థులు రెండవ స్థానంలో నిలిచారు. గ్రూప్‌డాన్స్ అంశంతో వెంకటేశ్వర వర్సిటీకి చెందిన విద్యార్థులు ప్రథమ, కృష్ణావర్సిటికీ చెందిన విద్యార్థులు ద్వితీయ స్థానం సాధించారు.

తహశీల్దార్ హామీతో దీక్షల విరమణ
మంగళగిరి, డిసెంబర్ 14: మండలపరిధిలోని ఆత్మకూరులో నిమ్మగడ్డ కాలనీ, వైఎస్‌ఆర్ కాలనీ, బీసీ కాలనీల్లో వౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆయా కాలనీల్లో నివాసం ఉంటున్న పేద కుటుంబాల ప్రజలు గ్రామ పంచాయితీ కార్యాలయం ఎదుట గడిచిన ఐదు రోజులుగా జరుపుతున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం తహశీల్దార్ జీ వసంతబాబు హామీతో విరమించారు. ఆయా కాలనీల్లో గ్రావెల్ రోడ్లు, కచ్చా డ్రెయిన్లు నిర్మిస్తామని, శ్మశాన వాటికకు స్థలాన్ని కేటాయిస్తామని, అవసరమైన విద్యుత్ స్తంభాలను కూడా ఏర్పాటు చేస్తామని తహశీల్దార్ వసంతబాబు హామీ ఇచ్చి దీక్షలో ఉన్న వారికి నిమ్మరసం ఇచ్చి విరమింప జేశారు. సీపీఎం మండల కార్యదర్శి ఏటుకూరి గంగాధరరావు, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పీ బాలకృష్ణ, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు మొసలి పకీరయ్య, సాంబశివరావు, దుర్గారావు, పీ ప్రసాద్, ఎం జ్యోతిబసు, సీతారామాంజనేయులు, జనార్థన్ తదితరులు పాల్గొన్నారు.

అన్నదాత వెన్నులో చలిపుట్టిస్తున్న తుఫాన్
చేబ్రోలు, డిసెంబర్ 14: కృష్ణా పశ్చిమ డెల్టాలో తుఫాన్ ప్రభావం అన్నదాత వెన్నులో చలి పుట్టిస్తుంది. గత రెండు రోజులుగా ఆకాశం మేఘావృతం కావడంతో పాటు ప్రభుత్వాధికారులు తుఫాన్‌ను ప్రకటించడంతో రైతుల కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఇప్పటికే డెల్టాలో ప్రధానంగా కొమ్మమూరు, అప్పాపురం ఛానల్ ఆయకట్టు పరిధిలో 80 శాతం మంది రైతులు వరికోతలు కోశారు. ఎక్కువశాతం పొలాల్లో వరిపంట ఓదెలపై ఉంది. తుఫాన్ ప్రభావం వలన అధికారులు అప్రమత్తం చేయడంతో రైతులు హడావుడిగా వరి ఓదెలను పూర్తిగా ఎండకుండానే కుప్పలుగా వేస్తున్నారు. శుక్రవారం పెద్ద ఎత్తున రైతులు తెల్లవారుజామునే పొలాల్లో పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఒకేసారి వరికుప్పలు రావడంతో కూలీలకు డిమాండ్ పెరిగింది. ఎకరాకు 3 వేల రూపాయల ధర పలుకుతుంది.