గుంటూరు

అభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, మే 27: పట్టణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పురోగతిపై పురపాలక శాఖ ప్రాంతీయ సంచాలకులు సిహెచ్ అనూరాధ శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. నిధులు మంజూరైన అభివృద్ధి పనులను త్వరిత గతిన నాణ్యతగా పూర్తిచేయాలని అనూరాధ పేర్కొన్నారు. పట్టణంలోని 1వ వార్డు బిఆర్ నగర్ మున్సిపల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన వేసవికాలం శిబిరాన్ని ఆర్‌డి అనూరాణ సందర్శించారు. వివిధ వార్డుల్లో డ్రెయిన్లలో పూడికతీత పనులను పర్యవేక్షించారు. వడదెబ్బ కేంద్రాన్ని, వీధికుక్కల ఆపరేషన్ ధియేటర్‌ను, నల్లచెరువు పార్కు, ఆటోనగర్ చెరువును తనిఖీచేశారు. మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు, డీఈఈ ఎన్ బ్రహ్మానందం, ఏఈలు ఏడుకొండలు, శివాజీ, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు జీవీ రామిరెడ్డి, నజీర్ తదితరులు పాల్గొన్నారు.