గుంటూరు

అగ్ని ప్రమాదంలో పూరిళ్లు దగ్ధం, రూ 6లక్షల ఆస్తి నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, మే 30: తెనాలి రూరల్ మండలం నందివెలుగు గ్రామ దళిత కాలనీలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో మూడు పూరిళ్ళు దగ్ధం కాగా సుమారు 6లక్షల రూపాయల వరకు ఆస్థినష్టం సంభవంచినట్లు తెనాలి ఫైర్ అధికారి కె నాగేశ్వరరావు తెలిపారు. గ్రామానికి దక్షిణంవైపుగా ఉన్న దళిత వాడలో విద్యుత్ షార్టుసర్క్యూట్ కారణంగా బెజవాడ ఆదాం గృహంలో మంటలు చెలరేగాయి. ఈ సంఘటనను గుర్తించి స్థానికులు మంటల ఆర్పే ప్రయత్నంచేసి విద్యుత్ సరఫరా జరుగుతుంన్న భయంతో కేకలు వేశారు. ఈలోగా ప్రక్కనే ఉన్న బెజవాడ ఎస్తేలు, బెజవాడ కయ్యూను అనే మరో ఇద్దరి పూరి గృహాలకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న తెనాలి ఫైర్ అధికారి నాగేశ్వరరావు తన సిబ్బందితో హుటాహుటిన తన సంఘటన ప్రదేశానికి చేరుకొని విద్యుత్ శాఖాధికారులకు ఫోను ద్వారా సమాచారం అందించి సరఫరాను నిలిపివేయించారు. తక్షణమే మంటలు కాలనీ అంతటికి వ్యాపించకుండా ఆర్పివేశారు. ఈ సంఘటనలో ఆదాం, ఎస్తేలు, కయ్యూనులకు చెందిన గృహం, అందులోని ఉపకరణాలు, 65వేల రూపాయల నగదు, 20శౌరీల బంగారపు వస్తువులు కాలి బూడిదైనట్లు బాధితుల ద్వారా తెలుసుకున్నామని ఫైర్ అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది పాండురంగారావు, నాగేంద్రరెడ్డి, ఎన్ బాలకృష్ణ, శివప్రసాద్, శివశంకరరావు, గ్రామస్థులు పాల్గొన్నారు.