గుంటూరు

చౌక్‌బాల్ పోటీలకు విశేష స్పందన: మన్నవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 30: మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని ఈనెల 28, 29, 30 తేదీల్లో ఏపి చౌక్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యాన స్థానిక ఎన్‌టిఆర్ స్టేడియంలో 9వ జూనియర్ జాతీయ చౌక్‌బాల్ ఛాంపియన్ షిప్ పోటీలు జరిగాయి. సోమవారం ముగింపు సందర్భంగా పోటీల్లో విజేతలకు ఏపి స్టేట్ చౌక్‌బాల్ సంఘం అధ్యక్షుడు దామచర్ల శ్రీనివాసరావు అధ్యక్షతన ఎన్‌టిఆర్ స్టేడియంలో బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పోటీల నిర్వహణ కమిటీ చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ నవ్యాంధ్ర నూతన రాజధానిలో జాతీయ స్థాయిలో చౌక్‌బాల్ పోటీలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సుమారు 16 రాష్ట్రాల నుండి 400 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. చౌక్‌బాల్ ఆటపై ప్రజలు బాగా ఆదరణ, ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడం వల్ల దేశంలో మారుమూల ఉన్న ఆటగాళ్లు బయటకు రావడానికి అవకాశం ఉంటుందన్నారు. సోమవారం జరిగిన పోటీల్లో విన్నర్స్‌గా మహారాష్ట్ర, రన్నర్స్‌గా పంజాబ్ జట్లు గెలుపొందాయి. మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, దామచర్ల శ్రీనివాసరావులు మాట్లాడుతూ ఎండలను సైతం లెక్కచేయకుండా క్రీడలను ప్రజలు తిలకిస్తున్నారని, చౌక్‌బాల్ క్రీడలు గుంటూరులో విజయవంతంగా జరుగుతుండటం పట్ల సంతోషాన్ని వ్యక్తంచేశారు. కార్యక్రమంలో భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, ఆంధ్రాబ్యాంకు ఎజిఎం రత్నకుమారి, హనుమంతరావు, కెపి రావు, షేక్ లాల్‌వజీర్, శ్రీరాం సుధాకర్, చిట్టిప్రోలు రత్నాకర్, రవీంద్ర, మల్లేశ్వరరావు పాల్గొన్నారు.