గుంటూరు

కాంగ్రెస్ హయాంలోనే పేట అభివృద్ధి: మాజీ మంత్రి కాసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసరావుపేట, మే 30: నరసరావుపేట పట్టణాన్ని ఒక ఉన్నతమైన పట్టణంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తీర్చిదిద్దడం జరిగిందని మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం ఈమేరకు ఆయన కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి ఇంటికి వెళ్ళి చెత్తను సేకరించి రిక్షాలు, ట్రాక్టర్ల ద్వారా బయటకు తరలించి క్లీన్ నరసరావుపేటగా తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని రోడ్లను సిమెంట్ రోడ్లుగా మార్చి ఆంధ్ర రాష్ట్రంలోనే మొత్తం సిమెంట్ రోడ్లు కలిగిన పట్టణంగా చేశామని అన్నారు. భూగర్భ డ్రైనేజ్ పథకాన్ని తీసుకువచ్చి, మురుగు నుండి శాశ్వత పరిష్కారాన్ని చేశామన్నారు. 22 కోట్ల రూపాయలతో మంచినీటి పథకాన్ని ఆదునికరించి, కేవలం 200 రూపాయలకే సుమారు ఏడు వేల కుళాయి కనెక్షన్లు ఇవ్వడం జరిగిందన్నారు. మురికి వాడల అభివృద్ధికి 25 కోట్ల రూపాయల గ్రాంట్‌ను మంజూరు చేయించి, ప్రతి వార్డులో సైడు కాలువలను నిర్మించి మురుగును రోడ్లపై ప్రవహించకుండా చేయడం జరిగిందన్నారు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర సర్వేలలో కనీసం పదో స్థానంలో కూడా నరసరావుపేట పట్టణం లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా సుపరిపాలనను అందించాలని, లంచాలను తగ్గించి నరసరావుపేటను ఉన్నతమైన పట్టణంగా తీర్చిదిద్దాలని తాను కోరుకుంటున్నట్లు కాసు కృష్ణారెడ్డి తెలిపారు.