గుంటూరు

స్టేడియంలో ఇంకుడు గుంతలకు స్పీకర్ శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసరావుపేట, మే 30: పట్టణంలోని సత్తెనపల్లిరోడ్డులో ఉన్న డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియంలో సోమవారం ఉదయం స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఇంకుడుగుంతలకు శంకుస్థాపన చేశారు. స్టేడియంలోని వాకర్స్‌ట్రాక్‌కు సమీపంలో మూడు ప్రాంతాల్లో మూడు ఇంకుడుగుంతలకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం వాకర్స్‌తో కలిసి స్పీకర్ కోడెల వాకింగ్ చేశారు. కొద్ది సేపు షటిల్ ఆడారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ 200కోట్ల రూపాయల విలువైన స్టేడియంలో పట్టణ ప్రజల కోసం అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేశామని అన్నారు. ప్రజలు ఆరోగ్యంగా, ఆహ్లాదకరంగా ఉండేందుకు జిమ్, వాకర్స్‌ట్రాక్, షటిల్ కోర్టులు, బాస్కెట్‌బాల్ కోర్టులు, వాలీబాల్ కోర్టులు, క్రికెట్ కోర్టులు ఏర్పాటు చేశామని అన్నారు. స్టేడియం ఉద్దేశ్యం సంపూర్ణంగా నెరవేరిందని అన్నారు. మెడిటేషన్ సెంటర్, స్విమ్మింగ్‌పూల్ వంటివి త్వరలో ఏర్పా టు చేయనున్నట్లు కోడెల తెలిపారు. నిధులు కోసం వేరే వారిని అడుగకుండా స్టేడియం నుండే నిధులు సంపాదించుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. పచ్చదనం, ఇంకుడుగుంతలను ఏర్పాటు చేయడం జరిగిందని, వీటి ప్రభావం రానున్న రోజుల్లో తెలుస్తుందని అన్నారు. రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన స్టేడియంలా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ఇది పట్టణ ప్రజలకు ఎం తగానో ఉపయోగపడుతుందని అన్నారు. కోడెల వెంట మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తా, కమిషనర్ భానూప్రతాప్, ప్రజారోగ్యశాఖ ఈఈ నాగమల్లేశ్వరరావు, మున్సిపల్ డిఈ శివరామకృష్ణ, ఏఈ రఫీ, స్టేడియం సభ్యులు డాక్టర్ బండ్ల రాంచంద్, రవి, షరీఫ్, జిలానీ మాలిక్ పాల్గొన్నారు.