గుంటూరు

2న నవనిర్మాణ దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 30: ప్రభుత్వ ఆదేశాల మేరకు, జూన్ 2వ తేదీన నగరంలోని పోలీసు పెరెడ్‌గ్రౌండ్స్‌లో జరిగే నవ నిర్మాణ దీక్ష విజయవంతానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కాంతిలాల్ దండే అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో నియోజకవర్గ అధికారులతో సమావేశమయ్యారు. దీక్షా కార్యక్రమం గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు జరగాలని, ప్రజాప్రతినిధులందరూ హాజరయ్యేలా చూడాలన్నారు. 2వ తేదీ ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విజయవాడలో నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయిస్తారని, అదే సమయంలో జిల్లాలోని ప్రతి ఒక్కరూ దీక్ష చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు. 2 నుండి 8వ తేదీ వరకు ప్రభుత్వం నిర్దేశించిన అంశాలపై చర్చలు జరగాలన్నారు. 8వ తేదీన మహా సంకల్పం కార్యక్రమాన్ని పోలీసు పెరెడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. 2వ తేదీ ఏఏ నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ నవ నిర్మాణ దీక్ష చేసేది ఈనెల 31వ తేదీలోగా వివరాలు తెలియజేయాలన్నారు. అనంతరం సేద్యపుకుంటలు, పూడికతీత, మరుగుదొడ్లు, సిసి రోడ్లు తదితర అంశాలపై కలెక్టర్ నియోజకవర్గాల వారీగా సమీక్షించారు. కార్యక్రమంలో జిల్లా రెవె న్యూ అధికారి కొసనా నాగబాబు వివి ధ శాఖల అధికారులు పాల్గొన్నారు.