గుంటూరు

ఎసిఎ కృషి ఆదర్శనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, మే 30: యువ క్రికెట్ క్రీడాకారులను తయారు చేయడంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఎసిఎ) చేస్తున్న కృషి ప్రశంసనీయమని, మిగతా అసోసియేషన్లకు ఆదర్శనీయమని బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాగూర్ అన్నారు. మంగళగిరి పట్టణ శివారులోని ఉడాటౌన్‌షిప్‌లో ఆంధ్రాక్రికెట్ అసోసియేన్ ఆధ్వర్యాన నిర్మిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ప్రాంగణంలో నిర్మించిన ఇండోర్ అ కాడమీని సోమవారం బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాగూర్ ప్రారంభించారు. నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని పరిశీలించారు. అకాడమీలో శిక్షణ పొందుతున్న యువ క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆంధ్రా క్రికెట్ అసోసియేన్ అధ్యక్షుడు డివిఎస్‌ఎస్ సోమయాజులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాగూర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులపై ఆధారపడి దేశంలో చాలా క్రికెట్ అసోసియేన్లు స్టేడియం నిర్మిస్తుండగా ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూడకుండా సొంతనిధులతో ఎసిఎ పూర్తి వసతి సౌకర్యాలతో స్టేడియంను నిర్మిస్తోందని ఆయన అన్నారు. భవిష్యత్తులో భారత మహిళా క్రికెట్‌జట్టు కూడా ప్రపంచంలో నెంబర్ 1 స్థాయికి రాగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తంచేశారు. ఎసిఎ ఆధ్వర్యంలో ఈ ఏడాది టెస్ట్ మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. భారత క్రికెట్ జట్టుకు కొత్తకోచ్ ఎంపిక జూన్ నెలాఖరులోగా జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఎసిఎ ప్రతినిధి ఎంఎస్‌కె ప్రసాద్ మాట్లాడుతూ 2010లో ఎసిఎ క్రికెట్ అకాడమీ ఏర్పాటయ్యాక జరిగిన, జరుగుతున్న కార్యక్రమాలను వివరించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, గుంటూరు లోక్‌సభ సభ్యుడు గల్లా జయదేవ్, బిసిసిఐ ప్రధాన కార్యదర్శి అజయ్ బి షిర్క్, ఎసిఎ ప్రధాన కార్యదర్శి ఎంపి గోకరాజు గంగరాజు, శాప్ చైర్మన్ పిఆర్ మోహన్, మంగళగిరి మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి, నవులూరు సర్పంచ్ బాణావత్ బాలాజీనాయక్ తదితరులు ప్రసంగించారు. ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్‌ను అభినందించారు.