గుంటూరు

హడలిన చిలకలూరిపేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిలకలూరిపేట, మే 30: ఒక పిచ్చికుక్క స్వైరవిహారంతో సోమవారం పేట హడలిపోయింది. ఆ కుక్క దాడిలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. పట్టణంలోని సుభానినగర్, రాజన్నపాలెం, అడ్డరోడ్డు సెంటర్, సుబ్బయ్యతోట ప్రాంతాల్లో పిచ్చికుక్క స్వైర విహారం చేసి రోడ్డుపైనున్న వారిపై దాడిచేసింది. తొలుత సుభాని నగర్‌కు చెందిన షేక్ మాబు సుభాని (19), షేక్ దరియావలి (16), షేక్ మున్నా (13), షేక్ బాజిత్ (4), షేక్ షకీలా (30), షేక్ రహమాన్ (24), షేక్ షఫి (5)లపై దాడిచేసి గాయపర్చింది. అలాగే రాగన్నపాలెంలో సంచరించిన పిచ్చికుక్క కె ధనుష్‌కుమార్ (54), జి కుమారి (35), టి సుశాంత్ (7), జి ఆంజనేయులు (28)లను గాయపర్చింది. అనంతరం అడ్డరోడ్డు సెంటర్‌లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వెంకటమ్మ (24), డి రాణి (35), ఎం యలమంద (53), బాజిబాబు (40), పి ఏసుబాబు (11), జె మంగమ్మ (50), కె సరస్వతి (7), షేక్ ముత్తూష (55)లను దాడిచేసి గాయపర్చింది. సుబ్బయ్యతోట ప్రాంతలో సంచరిస్తూ షేక్ మీరస (10), రోషన్ సమీర్ (6), షేక్ అష్మీద్ (54)లను కూడా కరిచింది. తనపై ఆ పిచ్చికుక్క దాడి చేసిన సమయంలో మూసిరెడ్డి వ్యక్తి దాన్ని ప్రతిఘటించి పక్కనే ఉన్న కర్రతో ఎదురుదాడి చేయడంతో అది అక్కడికక్కడే మృతిచెందింది. ఈ సంఘటనల్లో గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కుక్కకాటుతో తీవ్రంగా గాయపడిన వారికి ఇచ్చే ఇమ్యునో గ్లాబిరెన్సీ వ్యాక్సిన్ లేకపోవడంతో వారందరినీ గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా ఈ ప్రాంతంలో ఇంతమంది గాయపడటంతో జనం బెంబేలెత్తారు. ఇకనైనా పురపాలక అధికారులు దృష్టిసారించి పిచ్చికుక్కలు, కోతులను అరికట్టాలని కోరుతున్నారు.