గుంటూరు

‘సత్తెనపల్లి’ స్వచ్ఛమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తెనపల్లి, మే 30: స్వచ్చ సత్తెనపల్లిగా భాసిల్లుతున్నా, మరుగుదొడ్ల నిర్మాణంలో గిన్నిస్‌బుక్ రికార్డుల్లోకి ఎక్కి రచ్చ గెలిచినా ఇంట మాత్రం ఇంకా గెలవనేలేదు. నియోజక వర్గంలోని మారుమూల గ్రామల్లో సైతం మరుగుదొడ్ల నిర్మాణం జరిగేలా చూసి రికార్డు సృష్టించిన ఈ నియోజకవర్గంలో అసలైన నియోజకవర్గ కేంద్రమే స్వచ్ఛంగా లేదు. పట్టణ నడిబొడ్డున మున్సిపల్ అఫీసుకు కూతవేటు దూరంలోవున్న స్వీపర్స్ కాలనీవాసులకు మరుగుదొడ్లు, ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు లేకపోవడంతో ఒక్కో ఇంటిలో నాలుగైదు కుటుంబాలు నివసించాల్సిన పరిస్థితి నెలకొంది. వీరు పడే అగచాట్లు అన్నీ ఇన్నీకావు. మరుగుదొడ్లు లేక గత కొన్ని సంవత్సరాలుగా ఇళ్ళకు పక్కనేవున్న పెద్ద డ్రైనేజీ కాలువపైనే తమ కాలనీలో నివసించే కుటుంబాల వారు చాలావరకు గత్యంతరంలేక బహిరంగ మలవిసర్జన చేయక తప్పడం లేదని గల్లెపోగుల దానయ్య, నంబూరి జయమ్మ, మిషను బాలయ్య, మేడి ఎస్తేరి, పిల్లా నాగేంద్రమ్మ, మురుగుల రోశమ్మ, దాసరి సత్తెయ్య తదితరులు ఆవేదన వ్యక్తంచేశారు. ఇళ్ల మధ్య మలవిసర్జన చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా సిగ్గుచచ్చి ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు రాకతో కాలనీ వాసుల్లో ఆనందం వెల్లివిరిసింది. స్వచ్చ సత్తెనపల్లిగా పేరు మారుమోగుతుడడంతో మా పరిస్థితి మెరుగు పడుతుందనే ఆశతో కోడెల శివప్రసాదరావు మీదవున్న నమ్మకంతో బతుకుతున్నామని అన్నారు. ప్రభు త్వం వారు మరుగుదొడ్ల నిర్మాణాలను ప్రారంభించి ఐదు నెలలు కావస్తున్నా ఇంతవరకు పూర్తికాలేదని, మరికొందరికి దొడ్లు మంజూరు కాలేదని, సంబంధిత అధికారులను గట్టిగా అడుగుదామంటే ఇక్కడ నివసించేవారిలో కొందరు మున్సిపల్ అధికారుల వద్ద, కాంట్రాక్టు కూలీలుగా విధులను నిర్వహిస్తున్నామని, అందువల్ల గట్టిగా అడగలేక పోతున్నామని కాలనీవాసులు వాపోయారు. మరుగుదొడ్ల నిర్మాణ కాంట్రాక్టర్ నాసి రకంగా నిర్మిస్తున్నారని, కొందరికి మరుగుదొడ్ల నిర్మాణం ప్రారంభించి నెలలు గడుస్తున్నా పూర్తి కాలేదని బాధితులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల మధ్యే బహిరంగ మలవిసర్జన చేస్తుండడంతో రోగాల బారిన పడుతున్నామని, పసిపిల్లలు ఉండడంతో ఎంత జాగ్రత్తలు తీసుకున్నా పిల్లలను దోమల నుండి రక్షించుకోలేక పోతున్నామని, ఆహారంపై ఈగలు ముసిరి జ్వరాల బారిన పడుతున్నామని, కలుషితమైన ఆహారాల వలన ఆనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నామని పసిపిల్లల తల్లులు నంబూరి రాణి, చింతలు ఆదిలక్ష్మి అన్నారు. కాలువ అవతల ఇళ్లవారు చాలా వరకు మరుగుదొడ్ల గుంతలు తీయకుండా పైపులను సరాసరి కాలువలోకి కలుపుతున్నారని, కాలువ పక్కనే నివసిస్తున్న తాము మురుగు కాలువ వాసనకే సతమత మవుతుంటే బహిరంగ మల విసర్జన జరుగుతుండడంతో అన్నం కూడా తినలేక పోతున్నామని దాసరి సత్తెయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ మరుగు దొడ్లు నిర్మించుకొనే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం తమకు ఇళ్లు నిర్మించి ఇవ్వకపోయినా ఫర్వాలేదని, తమ స్తోమతకు తగ్గట్లు అప్పోసప్పోచేసి ఇళ్లు కట్టుకునేందుకు అనుమతులను ఇవ్వాలని, సంబంధిత అధికారులను వేడుకుంటున్నారు.
పది రోజుల్లో పూర్తిచేస్తాం: కమిషనర్
స్వీపర్ కాలనీలో నిర్మాణ నిపుణుల కొరత కారణంగా ఆగిపోయిన మరుగుదొడ్ల నిర్మాణాలను పదిరోజుల్లో పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకుంటానని మున్సిపల్ కమిషనర్ జి సాంబశివరావు అన్నారు. మరుగుదొడ్లకు గుంతలు తీయకుండా డైరెక్టుగా పైపులను కాలువలోకి కలిపిన విషయం తనదృష్టికి వచ్చిందని, అటువంటి వారిని గుర్తించి, గుంతలు తీయించుకొనేవిధంగా చర్యలు తీసుకొంటామని అన్నారు.
స్వచ్ఛ సత్తెనపల్లికి మచ్ఛరానివ్వను: మున్సిపల్ చైర్మన్
రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబు ప్రవేశపెట్టిన స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గాన్ని స్వచ్ఛ సత్తెనపల్లిగా మార్చే లక్ష్యంతో స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు చేస్తున్న కృషి ప్రపంచ దేశాల ప్రశంసలు అందుకుందని, స్వచ్ఛ సత్తెనపల్లికి మచ్ఛ రానీవ్వనని మున్సిపల్ చైర్మన్ యెల్లినేడి రామస్వామి అన్నారు. మరుగుదొడ్లు లేనివారు తమను సంప్రదిస్తే ప్రభుత్వమే వాటిని నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటానని అన్నారు.