గుంటూరు

తెనాలిలో అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి రూరల్, జూన్ 2: రాష్ట్రంలోని పలుజిల్లాలలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగ పసుపులేటి బాలశంకర్ అలియాస్ శంకర్‌ను తెనాలి పోలీసులు గురువారం వలపన్ని పట్టుకున్నారు. స్థానిక త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో డిఎస్పీ జివి రమణమూర్తి అరెస్టు వివరాలు వెల్లడించారు. నేరస్తుడు బాలశంకర్ చేబ్రోలు మండలం బండపాలెం గ్రామానికి చెందిన వ్యక్తిగా తెలిపారు. 2014నుండి పలు నేరాలకు పాల్పడుతూ భారీగా బంగారం, నగదు, వస్తువులు అపహిరిస్తున్నట్లు చెప్పారు. తెనాలి పోలీస్‌స్టేషన్ల పరిధిలో జరిగిన ఐదు దొంగతనాలలో ముద్దాయిగా విచారణలో తేలిందన్నారు. గురువారం త్రీటౌన్ పోలీసులు జెఎంజె కళాశాల వద్ద నిర్వహించిన వాహన తనిఖీలలో ఇతగాడు అంగలకుదురు వైపునుండి వస్తూ పోలీసులను చూసి పరారీ అయ్యే ప్రయత్నం చేయటంతో పోలీసులు వెంటబడి పట్టుకున్నారు. తమదైన రీతిలో విచారణ చేయగా తానుచేసిన నేరాలను వెల్లడించినట్లు చెప్పారు. కృష్ణాజిల్లా చల్లపల్లి, గుడివాడ, విజయవాడ సిటీలోని కృష్ణలంక, తెనాలి పరిసర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు చెప్పాడన్నారు. ఇతడి నుండి 40వేల నగదు, 220 గ్రాముల బంగారం, మోటారు బైకు స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ తెలిపారు. అలాగే సంఘంజాగర్లమూడి ఓబ్యాంకులో 80గ్రాముల బంగారం తాకట్టుపెట్టినట్లు తెలిసిందన్నారు. ఈమొత్తం రికవరీ చేసి నిందితునిపై కేసు నమోదుచేసినట్లు తెలిపారు. సమావేశంలో సిఐలు కోటేశ్వరరావు, ఎ అశోక్‌కుమార్, శ్రీనివాసరావు, కళ్యాణ్‌రాజ్, ఎస్‌ఐ జోగి శ్రీనివాసరావు, హెచ్‌సి పోలేరయ్య, సుబ్బారావు, గోపి తదితరులు ఉన్నారు.