గుంటూరు

నష్టపరిహారం చెల్లించి నిర్మాణం చేపట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజారు), జూన్ 2: ఎఇఎల్‌సికి సంబంధించిన గుంటగ్రౌండ్‌కు చెందిన స్థలాన్ని నగరపాలక సంస్థ అధికారులు రోడ్డు వెడల్పులో భాగంగా తీసుకుంటున్న దృష్ట్యా ఆ స్థలానికి వెంటనే నష్టపరిహారం చెల్లించి నిర్మాణ పనులు చేపట్టాలని ఇద్వా వ్యవస్థాపక అధ్యక్షుడు గోళ్లమూడి రాజసుందరంబాబు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక నార్త్ ప్యారీష్ చర్చి వద్ద ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో భీమ్‌సేన నాయకుడు నీలాంబరం, ఎఇఎల్‌సి ఆస్తుల పరిరక్షణ సమితి నాయకులు మద్దు ప్రేమజ్యోతిబాబు, రాంబాబు, పిల్లి శ్యామ్, కూరపాటి అజయ్‌కుమార్, దయాకరరావు, జి శంకరబాబు, ఇద్వా నగర కో ఆర్డినేటర్లు దుర్గ, కోటేశ్వరి, రజనీ, బి వెంకటరత్నంలతో కలిసి ఆయన మాట్లాడారు. గతంలో కలెక్టర్‌తో జరిగిన సమీక్షా సమావేశంలో ఎఇఎల్‌సి ప్రతినిధులు, జిఎంసి అధికారులు పాల్గొని రోడ్డు విస్తరణలో భాగంగా కొత్తపేటలోని ఆంజనేయస్వామి గుడి వైపు 8 అడుగులు, గుండగ్రౌండ్ వైపు 12 అడుగులు తీసుకునే విధంగా ఒప్పందం జరిగిందని, అయితే అందుకు విరుద్ధంగా నేడు 26 అడుగుల వరకు తీసుకుంటూ ప్రశ్నించిన తమను అక్రమంగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దమన్నారు. ఎఇఎల్‌సి అధ్యక్షుడు నగరంలో లేని సమయంలో నిర్మాణాలు చేపట్టడం ఏమిటని ప్రశ్నించారు. పరిహారాన్ని మూడు రెట్లు అందజేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఎఇఎల్‌సికి సంబంధించిన 100 ఎకరాల స్థలాన్ని తీసుకుని స్వర్ణ్భారతి నగర్ వాసులకు ఇళ్లస్థలాలు ఇచ్చారని, ప్రత్యామ్నాయ స్థలం చూపలేదన్నారు. క్రైస్తవులు గానీ ఎఇఎల్‌సి యాజమాన్యం కానీ రోడ్డు విస్తరణకు వ్యతిరేకం కాదని, నష్టపరిహారం మాత్రమే చెల్లించాలని కోరుతున్నామన్నారు. గతంలో తీసుకున్న భూములకు నేటికీ నష్టపరిహారం అందలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.