గుంటూరు

అర్ధరాత్రి కుంభవృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 2: జిల్లాలో బుధవారం అర్ధరాత్రి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో భారీ వర్షం కురిసింది. రాత్రి 1 గంట నుంచి గంటన్నరపాటు ఎడతెరిపి లేకుండా కుంభవృష్టితో పాటు ఈదురుగాలుల ధాటికి భారీ వటవృక్షాలు నేలకొరిగాయి. గుంటూరు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపునీరు ప్రవహించడంతో పాటు చెట్లు కూలిపోవడంతో రాక పోకలకు అంతరాయం కలిగింది. అరండల్‌పేట, కలెక్టరేట్, ఏటి అగ్రహారం, పట్ట్భాపురం, శ్యామలానగర్, బృందావనగార్డెన్స్, రెడ్డిపాలెం తదితర ప్రాంతాల్లో చెట్లు రోడ్లకు అడ్డంగా విరిగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ వైర్లు తెగి పడటంతో తెల్లవారు ఝాము వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 10 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతలైన నల్లచెరువు, ఇందిరా ప్రియదర్శిని కాలనీ, శ్రీనివాసరావుతోట, ఏటుకూరు ప్రాంతాల్లో వర్షపునీటికి మురుగునీరు తోడై రోడ్లపైకి ప్రవహించింది. ఇలా ఉండగా నవ నిర్మాణ దీక్ష సందర్భంగా పోలీసుపెరెడ్ గ్రౌండ్స్‌లో పెద్ద ఎత్తున అధికారులు ఏర్పాట్లు చేశారు. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి గ్రౌండ్‌లో నీరు చేరడంతో పాటు షామియానాలు కుప్పకూలడంతో వేదికను శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఆవరణకు మార్చారు. తెనాలి నరసరావుపేట డివిజన్లలోని పలు గ్రామాల్లో విస్తారంగా వర్షాలు కురిసాయి. నగర శివార్లలో పిడుగులు పడినప్పటికీ అర్ధరాత్రి కావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మున్సిపల్, విద్యుత్, అర్ అండ్ బి శాఖల అధికారులు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.
బాపట్లలో పెనుగాలులు
బాపట్ల: పట్టణంలో, మండలంలో బుధవారం అర్ధరాత్రి తర్వాత మొదలైన ఈదురుగాలులు, భారీ వర్షం స్థానికంగా బీభత్సాన్ని సృష్టించాయి. బాపట్లలోని భీమావారిపాలెం పార్కు వద్ద, వెదుళ్లపల్లి రోడ్డులో, రైలుపేటలో, సూర్యలంక రోడ్డులో పెద్ద పెద్ద వృక్షాలు ఈదురుగాలులకు నేలకూలాయి. అనేక చోట్ల విద్యుత్ తీగలు తెగిపడడంతో గురువారం స్థానికంగా తీవ్రమైన విద్యుత్ కోత సమస్య నెలకొంది. ఇలావుండగా స్థానిక నరాలశెట్టివారిపాలెంలోని రామాలయం సమీపంలో విద్యుత్ తీగలు తెగిపడటంతో ముస్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు సత్యబాబు (24) మృత్యువాత పడ్డాడు. ఈ ఘటనతో నరాలశెట్టివారిపాలెం ప్రజలు ఉలిక్కిపడ్డారు. మృతదేహాన్ని స్థానిక ఏరియా వైద్యశాలకు తరలించి పోస్ట్‌మార్టమ్ జరిపించారు.