గుంటూరు

‘కోల్డ్’స్కాంలో 15 మంది ఉద్యోగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 2: జిడిసిసిబిలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ పూరె్తైంది. మొత్తం కోటి 55 లక్షలకు సంబంధించిన నరసరావుపేట కోల్డ్‌స్టోరేజీ అవినీతి భాగోతంలో 15 మంది ఉద్యోగులకు భాగస్వామ్యమున్నట్లు తేలింది. 2013లో నరసరావుపేట కోల్డ్‌స్టోరేజీలో రైతులు నిల్వచేసుకున్న క్వింటాళ్ల కొద్దీ మిర్చిటిక్కీలు మాయమైన వ్యవహారంలో అప్పటి జిడిసిసిబి చైర్మన్ నల్లపాటి చంద్రశేఖరరావుతో సహా కొందరు అధికారులు, ఉద్యోగులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీటిలో నల్లపాటి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోగా, అక్రమాలకు పాల్పడిన మరికొందరు ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈ విషయమై గురువారం బ్యాంకు పాలకవర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుత జిడిసిసిబి చైర్మన్ ముమ్మనేని వెంకట సుబ్బయ్యతో సహా పలువురు డైరెక్టర్లు ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు ముందు బ్యాంకుకు రావాల్సిన సొమ్మును రికవరీ చేయాలని నిర్ణయించారు. తదుపరి సమావేశంలోగా సొమ్ము రికవరీతో పాటు ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. గత పాలకవర్గ హయాంలో కోల్డ్‌స్టోరేజీ అవినీతి పర్వంతో పాటు పలు అవినీతి ఆరోపణలపై ఇంకా విచారణ జరుగుతోంది. కాంట్రాక్టు ఉద్యోగుల నియామకాలు, నాశిరకమైన నిర్మాణాలు, ఉద్యోగుల జీతాలకు సంబంధించిన అంశాలపై కూడా విజిలెన్సు అధికారులు విచారిస్తున్నారు. కోల్డ్‌స్టోరేజీ వ్యవహారంలో తెరవెనుక ఓ అధికారి చక్రం తిప్పినట్లు అనుమానిస్తున్నారు. సదరు అధికారిని పూర్తిస్థాయిలో విచారిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్తున్నారు. అక్రమాలకు సంబంధించి గత పాలకవర్గం తీసుకున్న నిర్ణయాల్లో కొన్నింటికి ప్రస్తుత పాలకవర్గం కూడా ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది.