గుంటూరు

రాష్ట్ర పునర్నిర్మాణానికి కంకణబద్ధులు కండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణానికి అందరూ కంకణబద్ధులు కావాలని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన జరిగిన రెండేళ్లు పూరె్తైన సందర్భంగా ప్రభుత్వాదేశాల మేరకు గురువారం శ్రీ వెంకటేశ్వరా విజ్ఞాన మందిరంలో జిల్లా యంత్రాం గం ఏర్పాటుచేసిన నవ నిర్మాణదీక్ష సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అశాస్ర్తియంగా రాష్ట్రాన్ని విభజించిన తీరు బాధాకరమని, అయినా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని పుల్లారావు అన్నారు. రెండు సంవత్సరాల నాటికి రాష్ట్ర బడ్జెట్ 16 వేల కోట్లతో ఉన్నా ఈ రెండేళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాల కారణంగా కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రం అభివృద్ధి సాధించిందన్నారు. రైతు సంక్షేమానికి రూ.24 వేల కోట్లతో రుణమాఫీని చేపట్టిందన్నారు. డ్వాక్రా సంఘాలకు పెట్టుబడి నిధిని మంజూరు చేశామన్నారు. రాష్ట్రంలోని కోటిన్నర మంది అసంఘటిత రంగ కార్మికులకు చంద్రన్న బీమా పథకాన్ని వర్తింపచేస్తున్నట్లు పుల్లారావు వెల్లడించారు. ప్రతి ఇంటికీ నెట్ కనెక్షన్ అందించేందుకు జూలై నెలాఖరు నాటికి ఫైబర్ గ్రిడ్ పనులు పూర్తి చేయనున్నట్లు చెప్పారు. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణాన్ని పూర్తిచేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తోందన్నారు. శాసనమండలి సభ్యుడు ఎఎస్ రామకృష్ణ, 20 సూత్రా ల ఆర్థిక కార్యక్రమం అధ్యక్షుడు శ్రీనివాస శేష సాయిబాబు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్, డిసిసిబి అధ్యక్షుడు ఎం వెంకట సుబ్బయ్య, ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ స్థూల జాతీయోత్పత్తి ఆధారంగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం అవిరళ కృషి చేస్తోందన్నారు. ఇందుకోసం ప్రభు త్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందన్నారు. ముఖ్యమైనవి, సేద్యపు నీటికుంటలు, ఇంకుడుగుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఉపాధి హామీ పథకం వంటి కార్యక్రమాలు రాష్ట్భ్రావృద్ధికి దోహద పడుతున్నాయన్నారు. అసమానతలు లేని, ఆరోగ్యకరమైన సమసమాజం కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కా వాలని పిలుపునిచ్చారు. అంతకుముం దు విజయవాడ నుండి ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్న కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ద్వారా విజ్ఞాన మందిరంలో అతిథులు, ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఆప్కో అధ్యక్షుడు మురుగుడు హనుమంతరావు, డిసిఎంఎస్ చైర్మన్ ఇక్కుర్తి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, అర్బన్, రూరల్ ఎస్‌పిలు సర్వశ్రేష్ఠ త్రిపాఠి, నారాయణనాయక్, సంయుక్త కలెక్టర్-2 ముంగా వెంకటేశ్వరరావు, వివిధ ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.