గుంటూరు

నవ్యాంధ్ర నిర్మాణానికి కంకణబద్ధులు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, జూన్ 3: నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని తమవంతుగా సహకారం అందించాలని తెనాలి శాసనసభ్యుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ సూచించారు. శుక్రవారం నవనిర్మాణ దీక్ష రెండవ రోజున మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో కష్టనష్టాలను ఓర్చి తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలిజెప్పాలనే సంకల్పంతో నిరంతరంగా అభివృద్ధి కోసం పటుపడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయడుకు ప్రజలు తమ పూర్తి సహకారం అందించాలని విఙ్ఞప్తి చేశారు. అటువంటి ముఖ్యమంత్రిని ప్రతిపక్ష నాయకులు అసభ్యపదజాలంతో ప్రజలను రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేయటాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. 10 సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా ఎంతో అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడును విమర్శించే స్థాయికి పిల్ల రాజకీయ నాయకులు రావటం విచిత్రంగా ఉందన్నారు. నవనిర్మాణ దీక్ష ద్వారా రాష్ట్ర పరిస్థితులు, ప్రజల బాధ్యతలు, ముందున్న సమస్యలు, నష్టపోయిన ప్రగతి వంటి అనేక అంశాలను ప్రజలకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. జగన్‌కు తండ్రి వయస్సున్న చంద్రబాబు నాయుడును ప్రతిపక్షనేత స్థానంలో ఉండి జగన్మోహన్‌రెడ్డి చెప్పుతో కొట్టాలంటూ వ్యాఖ్యలు చేయటం ఆయన సభ్యతకే వదలివేస్తున్నామన్నారు. అధిక ప్రసంగాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలకు స్పస్తిపలికి ప్రజలతో పాటుగా ప్రతిపక్ష నాయకులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తే రాష్ట్రం త్వరితగతిన అభివృద్ది చెందుతుందని ఆయన సూచించారు. తొలుత నవాంధ్రరాష్ట్భ్రావృద్ధిని కోరుతూ వెంకటలక్ష్మీ బృందం ప్రదర్శించిన నృత్యరూపకం ప్రేక్షకులను అలరించాయి. ఈకార్యక్రమంలో ఆర్డీఓ జి నరసింహులు, మున్సిపల్ చైర్మన్ కొత్తమాసు తులసీదాసు, కమీషనర్ కె శకుంతల, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిదులు, అంగన్‌వాడీ,వైద్య ఆరోగ్యశాఖ కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.