గుంటూరు

ఇస్రో శాస్తవ్రేత్తల కృషి అభినందనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 24: రోదశి పరిశోధనల్లో నవచరిత్ర సృష్టించి ఆకాశమంత విజయాన్ని సాధించడంలో ఇస్రో శాస్తవ్రేత్తల కృషి అభినందనీయమని సైంటిస్ట్, ప్రొఫెసర్ కె సుధాకర్‌బాబు పేర్కొన్నారు. అవగాహన సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఇస్రో శాస్తవ్రేత్తల కృషిని అభినందిస్తూ నగరంలో అభినందన ర్యాలీ నిర్వహించారు. ప్రారంభ కార్యక్రమంలో సుధాకర్‌బాబు మాట్లాడుతూ ఒకే రాకెట్‌లో 20 ఉప గ్రహాలను అంతరిక్షంలోకి పంపడం ద్వారా ఇస్రో సాధించిన విజయం అంతరిక్ష రంగంలో భారత్ విజయ పరంపరలో సరికొత్త అధ్యాయమన్నారు. ప్రిన్సిపాల్ కె శ్రీమన్నారాయణ మాట్లాడుతూ ఇస్రో శాస్తవ్రేత్తల కృషి నిరుపమానమన్నారు. అనంతరం అవగాహన సంస్థ కార్యాలయం నుంచి జయహో భారత్ అంటూ నినాదాలు చేస్తూ లాడ్జిసెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యావేత్త ఇ చంద్రయ్య, సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, ఉపాధ్యక్షుడు పిఎస్ మూర్తి, కార్యవర్గ సభ్యులు ఎ హరి, సింగరయ్య తదితరులు పాల్గొన్నారు.