గుంటూరు

రికార్డుస్థాయి వర్షపాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, జూలై 1: నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభం కావడంతో జూన్‌లో మంగళగిరి ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదయింది. గడిచిన పదేళ్లల్లోలేనవిధంగా 334.4 మి.మీ వర్షపాతం నమోదయిందని మండల ఎఎస్‌ఓ వెల్లడించారు. జూన్‌మాసం సగటు వర్షపాతం 119 మిమీ లని గత పదేళ్లల్లో ఈ ఏడాది నమోదయినట్లుగా వర్షపాతం ఎప్పుడూ నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు. గత మే కూడా సాధారణ వర్షపాతం 56మి.మీ కాగా 118.6మి.మీ నమోదయింది. సాధారణం కంటే రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతో వాతావరణం చల్లబడటమే కాకుండా రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు. గడిచిన వారం రోజులుగా ప్రతిరోజు ఏదో ఒక సమయంలో వర్షం కురుస్తూనే ఉంది. శుక్రవారం కూడా మంగళగిరి ప్రాంతంలో ఎడతెరిపిలేని వర్షం కురిసింది.