గుంటూరు

తెలుగుజాతి పౌరుష ప్రతాపాలు చాటిన అల్లూరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 4: తెలుగుజాతి పౌరుష ప్రతాపాలను ప్రపంచానికి చాటిన మాన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగనిరతిని, శౌర్య పరాక్రమాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని అవగాహన సంస్థ నిర్వహించిన అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొన్న వివిధ రంగాల ప్రముఖులు నివాళులర్పించారు. సోమవారం ఉదయం నాజ్‌సెంటర్‌లోని అల్లూరి విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర పోరాటాన్ని విప్లవపంధావైపు మళ్లించిన యోధుడని కొనియాడారు. బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు పాశం రవీంద్రయాదవ్ మాట్లాడుతూ మహావీరుడు అల్లూరి వంటి వీరుల త్యాగ ఫలాలను అనుభవిస్తున్న ప్రజాప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోక పో వడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో ఆంధ్ర ప్రాంత ప్రయోజన పరిరక్షణ సమితి కార్యదర్శి పిఎస్ మూర్తి, అవగాహన సంస్థ సభ్యులు మురళీకృష్ణ, నారపరెడ్డి, కస్తూరి సైదులు, రోశయ్య, ఏడుకొండలు పాల్గొన్నారు.