గుంటూరు

విశ్వసనీయతకు పాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 8: రాజకీయాల్లో విశ్వసనీయతకు తావులేకుండా దాన్ని పాతర వేసిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు శుక్రవారం నగరంలో గడప గడపకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని అప్పిరెడ్డి, పలువురు నేతలు ప్రారంభించారు. స్థానిక ఎన్జీవో కాలనీలో కార్యక్రమాన్ని ప్రారంభించిన అప్పిరెడ్డి తదితరులు ఇంటింటికీ వెళ్లి గడప గడపకు వైసిపి కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో, చంద్రబాబు వాగ్దానాల అమలులో విఫలమైన విషయాన్ని తదితర అంశాలను కరపత్రాల ద్వారా వివరించారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షుడు పడాల సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సభలో అప్పిరెడ్డి మాట్లాడుతూ ఇష్టమొచ్చినట్లు వాగ్దానాలు చేసి నెరవేర్చని నేపథ్యంలో ప్రజల పక్షాన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వీధి పోరాటాలు చేయాల్సి వస్తుందే తప్ప రాజకీయ లబ్ధికోసం కాదని స్పష్టంచేశారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ అనుక్షణం అండగా ఉంటానని అన్నారు. రైతు, డ్వాక్రా రుణాలను బేషరతుగా రద్దుచేస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని, అలా కుదరని పక్షంలో రూ. 2 వేల నిరుద్యోగ భృతి కల్పిస్తామని వందలాది హామీలను అలవోకగా ఇచ్చి, అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు నిలువునా ముంచారని దుయ్యబట్టారు. అడ్డగోలు దోపిడీకి అభివృద్ధి అనే ముసుగు తొడిగి అందినకాడికి దోచుకోవడమే తప్ప ప్రజల సమస్యలను పట్టించుకున్న దాఖలాలు లేవని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలను వంచించిన టిడిపి ప్రభుత్వం రోజురోజుకూ అధికారానికి దూరమయ్యేందుకు దగ్గరవుతుందన్నారు. ప్రజాస్వామ్యం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కార్పొరేషన్ ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై వైసిపి ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజల నుండి విశేష స్పందన రావడం హర్షించదగ్గ విషయమన్నారు.
తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్త్ఫా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రెండేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు త్రిడి సినిమా చందంగా కళ్లకు కట్టేలా చూపించారని విమర్శించారు. కాగా గడప గడపకు వైసిపి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎక్కడికక్కడ బ్యానర్లు, జెండాలు కట్టి నాయకులకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర వాణిజ్యవిభాగం అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, రాష్ట్ర నాయకులు కిలారి రోశయ్య, నాయకులు యేరువ నర్సిరెడ్డి, అంగడి శ్రీనివాసరావు, పానుగంటి చైతన్య, ఎలికా శ్రీకాంత్‌యాదవ్, కొలకలూరి కోటేశ్వరరావు, గనిక జాన్సీ, షేక్ జానీ, దాసరి కిరణ్‌కుమార్, పల్లపు శివ, శారదాలక్ష్మి, విజయమాధవి, సరోజసుధ పాల్గొన్నారు.